మురగదాస్ ‘దర్బార్’ సినిమా అప్పుడే అయిపోయిందా?…


మురగదాస్ 'దర్బార్' సినిమా అప్పుడే అయిపోయిందా?...
మురగదాస్ ‘దర్బార్’ సినిమా అప్పుడే అయిపోయిందా?…

తమిళ సినిమా పరిశ్రమ నుండి ‘ఏ.ఆర్.మురుగదాస్‘ పెద్ద దర్శకులు. దాదాపు తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలో కలిపి 12 సినిమాలకి దర్శకత్వం చేసారు. మురగదాస్ గారు సినిమాల ద్వారా మంచి మెసేజ్ ని పంపడం జనాలకి బాగా నచ్చింది. అందుకే తెలుగులో తీసిన సినిమాలు సరిగ్గా ఆడకపోయినా మురగదాస్ గారి సినిమాలు అంటే తెలుగు జనాలకి బాగా ఇష్టం, వాటిని ఆదరిస్తారు కూడా…..

చిరంజీవి గారితో కలిసి ‘స్టాలిన్’ సినిమాతీసారు… సినిమా పరంగా జనాలకి నచ్చకపోయినా “ముగ్గురికి సహాయం చేయాలి, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి సహాయం చేయాలి” అని చెప్పిన మాట బాగా నచ్చింది. తెలుగులో కూడా మంచి సామర్థ్యం ఉన్న దర్శకుడిగా పేరు పొందాడు. కానీ తర్వాత మహేష్ బాబు తో చేసిన ‘స్పైడర్’ సినిమా కూడా ఘోర పరాజయం అయ్యింది. ఇప్పుడు ‘రజినీకాంత్’ గారితో దర్బార్ సినిమా చేస్తున్నారు. అది తెలుగు-తమిళంలో ఏకధాటిగా విడుదల అవుతుంది.

అయితే సినిమా స్టార్ట్ చేయడం జరిగిన దగ్గరనుండి ఏదో ఒక ఫోటో నెట్ లో హల్చల్ చేస్తుంటే ఈ రోజు సినిమా షూటింగ్ అయిపోయింది అనే టాపిక్ ట్రెండింగ్ లో నడుస్తుంది. మొత్తానికి సంక్రాంతి పండగ ని టార్గెట్ చేసిన ఈ సినిమా ఇంత తొందరగా కంప్లీట్ అవ్వడం చూస్తుంటే గ్రాఫిక్స్ వర్క్ ఉండొచ్చు అంటున్నారు తమిళ వర్గాల వాళ్ళు. మురగదాస్ గారి సినిమాలు ఎక్కువగా గ్రాఫిక్స్ కి సంబంధం ఉండవు. కానీ గ్రాఫిక్స్ వర్క్ అంటే ఈ సినిమాలో రజినీకాంత్ గారు పోలీస్ అధికారి కాబట్టి వాటికి సంబంధించిన గ్రాఫిక్ సీన్స్ ఉండొచ్చు అంటున్నారు తమిళ సినిమా వర్గాలకి సంబంధించిన వాళ్ళు.

రజినీకాంత్ గారు కూడా సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ‘పేట’ 2019 సంక్రాంతికి రిలీజ్ అయినా కూడా మన తెలుగు సినిమాలు ఎక్కువగా ఉండటం వలన రేస్ లో వెనుకబడిపోయింది….కానీ సినిమా మాత్రం రజినీకాంత్ గారి తెలుగు ఫ్యాన్స్ కి ఒక మంచి విందు భోజనం అయ్యింది. చూద్దాం మరి మొదటి సారి కలిసి పని చేస్తున్న రజినీకాంత్-మురగదాస్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో?

Credit: Twitter