అయిదోసారి తలైవ @రూ.200 కోట్లు


అయిదోసారి తలైవ @రూ.200 కోట్లు
అయిదోసారి తలైవ @రూ.200 కోట్లు

సినిమా మొదలై సీన్ దగ్గరనుండి మొదలుపెడితే ఫస్ట్ సీన్ ఆదిత్య అరుణాచలం ఊచకోత ఫైట్. తరువాత దుమ్ము దూళి సాంగ్, ఇక ఆ వెంటనే విమెన్ ట్రాఫికింగ్ ఎపిసోడ్, తరువాత నయనతార తో లవ్ ట్రాక్, తలైవా డాన్సులు, సెన్సిబుల్ కామెడీ, ఇంటర్వెల్ బ్లాక్, ట్విస్ట్, ఫాదర్ – డాటర్ సెంటిమెంట్, రజనీ మెచ్యుర్డ్ యాక్టింగ్, రైల్వే స్టేషన్ ఫైట్, నివేద యాక్టింగ్, రజనీ ఫిజికల్ టెస్ట్ కి రెడీ అయ్యే సీన్, ఆదిత్య అరుణాచలం జైల్ ట్రాప్, క్లైమాక్స్ ఫైట్ ఇలా దర్బార్ సినిమా మొదటినుండి చివరిదాకా, ప్రతీ 10 నిమిషాలకు ఒకసారి టాప్ గేర్ లో కార్ రింగ్ కటింగ్ కొట్టినట్టు ఉంటుంది. ఈ సినిమా చూసిన తరువాత అందరూ “బాప్ తో.. బాప్ హి రహేగా.” అని ఒప్పుకున్నారు.

ఇక ఇక్కడ అక్కడ,పెద్ద సినిమాల పోటీలు దాటుకుని మరీ దర్బార్ రూ. 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. ఇంకా ఫుల్ రన్ అయ్యేసరికి ఇంకొక రూ.50 కోట్లు కలెక్షన్స్ వస్తాయి. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఇంకా కలిపితే సినిమా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పవచ్చు. ఇప్పటిదాకా రజనీ గత సినిమాలు అయిన రోబో, కబలి, 2.0, పేట లతోపాటు ఈ సినిమా కూడా 200 కోట్ల క్లబ్ లో చేరింది. మురుగదాస్ స్క్రీన్ ప్లే కి ప్రశంసలు లభించినా ఈ సినిమా యావత్ రజనీ వన్ మ్యాన్ షో అనేది గట్టి నిజం. ఎదో కొత్తగా ఇండస్ట్రీ కి వచ్చి ఏదో చేసేయ్యాలనే కసి ఉన్న యంగ్ హీరోలా రజనీకాంత్ హార్డ్ వర్క్ చేసారు. మొత్తానికి తమిళ అభిమానులకు ఈ సంక్రాంతి కూడా డబల్ ధమాకా అని చెప్పవచ్చు.