దాసరి త‌న‌యుల ఆస్తివివాదం!


దాసరి త‌న‌యుల ఆస్తివివాదం!
దాసరి త‌న‌యుల ఆస్తివివాదం!

ద‌ర్శ‌క‌ర‌త్నం దాస‌రి నారాయ‌ణ‌రావు త‌న‌యుల మ‌ధ్య ఆస్థి వివాదం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోందా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి. ఇటీవ‌ల దాస‌రి చిన్న కుమారుడు దాస‌రి అరుణ్‌కుమార్ త‌న అన్న ప్ర‌భు ఇంట్లోకి చొర‌బ‌డ్డాడ‌ని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో అన్న దాస‌రి ప్ర‌భు ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. గేటు దూకి త‌మ ఇంట్లోకి చొర‌బ‌డి త‌న‌పై, త‌న భార్య‌పై దౌర్జ‌న్యం చేశాడ‌ని అరుణ్‌కుమార్‌పై దాస‌రి ప్ర‌భు కేసు న‌మోదు చేయించారు.

దీనిపై శ‌నివారం దాస‌రి అరుణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న సోద‌రుడు త‌న గురించి చెబుతున్న వ‌న్నీ అవాస్త‌వాల‌నీ, ఆధారాలుంటే చూపించాల‌ని దాస‌రి అరుణ్‌కుమార్ స‌వాల్ చేశారు. ఆస్థి వివాదం గురించి సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ని ఊరికే పిలుస్తున్నాడు. తాము ఏమ‌న్నా ప్రిన్స్ హ్యారీ, ప్రిన్స్ విలియ‌మ్స్‌ల‌మి కాదు క‌దా` అన్నారు.

త‌న తండ్రి ఇంటిని ముగ్గురికి స‌మానంగా రాసిచ్చార‌ని, కానీ ఆ ఇంట్లో త‌న సోద‌రుడు వుంటున్నాడ‌ని, కోర్టు ఆదేశాల అనుసారం ఆ ఇంటిని ఏ ఒక్క‌రికీ తెలియ‌కుండా అమ్మొద్ద‌ని వీలునామా రాసి వుంద‌ని ఈ సంద‌ర్భంగా దాస‌రి అరుణ్‌కుమార్ స్ప‌ష్టం చేశారు. అయితే దాసరి ప్ర‌భు మాత్రం త‌న తండ్రి ఇంటిని త‌న కూతురికి అంటే మ‌న‌వ‌రాలికి రాసి ఇచ్చార‌ని, ఆ వీలునామా ప్ర‌కార‌మే తాము ఈ ఇంట్లో వుంటున్నామ‌ని చెప్ప‌డం గంద‌ర‌గోళంగా మారింది. ఈ వివాద ప‌రిష్కారం కోసం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.