సినీ పెద్దలపై బాంబ్ పేల్చిన దాసరి కొడుకు


dasari prabhu

సినీ రంగానికి చెందిన పలువురు పెద్దలు నా సమస్యని పరిష్కరించడం లేదని బాంబ్ పేల్చాడు దాసరి నారాయణరావు పెద్ద కొడుకు దాసరి ప్రభు . దాదాపు పది రోజుల పాటు హైదరాబాద్ , చిత్తూర్ , బెంగుళూర్ లలో గడిపిన దాసరి ప్రభు ఎట్టకేలకు నిన్న హైదరాబాద్ వచ్చాడు . పది రోజుల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ప్రభు ని రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు .

మా నాన్న దాసరి నారాయణరావు పరిశ్రమలో ఎలాంటి సమస్య వచ్చినా క్షణాల్లో పరిష్కరించేవాడని కానీ మా ఇంటి సమస్యని సినీ పెద్దలు పట్టించుకోవడమే లేదంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు . నా మాజీ భార్య సుశీల తో ఆస్తుల గొడవలు ఉన్నాయని , వాటిని పరిష్కరించు కోవడానికే వెళ్లానని కానీ నావల్ల కాలేదని , అలాగే మా తమ్ముడు తో కూడా ఆస్తుల గొడవలు ఉన్నాయని అంటున్నాడు దాసరి ప్రభు . మొత్తానికి దాసరి పెద్ద కొడుకు అజ్ఞాతం వీడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు .