కూతుళ్ళ దినోత్సవ బహుమతులు..


Chiranjeevi turns photographer for Upasana
కూతుళ్ళ జన్మదినాన బహుమతులు..

నిన్న అనగా 22 సెప్టెంబర్ 2019 (డాటర్స్ డే) “కూతుళ్ళ జన్మదినం”. మదర్స్ డే, ఫాథర్స్ డే.. ఎలాగో డాటర్స్ డే మాకు ముఖ్యం అని మహిళా సెలెబ్రెటీస్, రాజకీయ నాయకులూ అందరూ తమ తమ మాధ్యమాల్లో పోస్ట్స్ పెట్టారు.

స్టైలిష్ స్టార్ “అల్లు అర్జున్” తన కూతురుతో కలిసి “అల వైకుంఠపురం లో” సినిమాలోని ట్రైలర్ లో ఉన్న డైలాగు “ఎంట్రోయి గ్యాప్ ఇచ్చావు…. ఇవ్వాళా వచ్చింది” అని చెప్పించారు. ఇక తన కూతురు కూడా చాలా ముద్దుగా చెప్పి నాన్న కి కౌగిలించుకుంది. నిజంగా అంత చిన్న పిల్ల ఒక్క నిమిషంలో చాలా చురుకుగా, చమత్కారంగా చెప్పడం చూసి అల్లు అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.

అయితే నిన్న జరిగిన “సైరా” ఆడియో విడుదల కార్యక్రమానికి వచ్చిన మెగా కోడలు, రామ్ చరణ్ గారి సతీమణి “ఉపాసన కొణిదెల” గారు ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ మరియు అందులో ఉండే ఫోటో ఇప్పుడు వైరల్ అయింది.

ఆ ఫోటో ని బాగా గమనిస్తే ఉపాసన గారు మంచి ఫోజ్ ఇచ్చారు బాగానే ఉంది, ఫోటో ని బాగా గమనిస్తే అందులో ఒక అద్దం ఉంది, ఆ అద్దంలో మన చిరంజీవి గారు ఫోటో తీస్తున్నారు. కోడలు అంటే కుమార్తెకు సమానంగా చూసుకున్న మెగాస్టార్ గారు ఆ ఫోటో తియ్యడం చూసి మెగా అభిమానులు కూడా తెగ సంబర పడిపోతున్నారు. ఆ ఫోటో షేర్ చేసినందుకు ఉపాసన గారికి థాంక్స్ చెప్తున్నారు.

ఇంకా చాలా మంది సెలెబ్రెటీస్ కూడా వాళ్ల ఫొటోస్ ని మాధ్యమాల్లో పోస్ట్స్ చేసారు. అందులో మోహన్ బాబు గారు, కమల్ హాసన్ గారు లాంటి పెద్ద వాళ్ళు చాలా మంది కూతురి విలువల గురించి గొప్పగా చెప్పారు.

 

Credit: Twitter