మహేష్ బాబు డైలాగ్ చెప్పిన ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్

మహేష్ బాబు డైలాగ్ చెప్పిన ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్
మహేష్ బాబు డైలాగ్ చెప్పిన ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్

ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గత కొంత కాలంగా టిక్ టాక్ లో హల్చల్ చేస్తోన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ఈ లాక్ డౌన్ సమయంలో క్రికెట్ కు సంబంధించిన వ్యవహారాలు ఏం జరగట్లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటున్న వార్నర్ వరసపెట్టి టిక్ టాక్ వీడియోలతో అలరిస్తున్నాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున గత ఆరేళ్లుగా ఆడుతున్న ఈ డాషింగ్ ఓపెనర్ కు హైదరాబాద్ తో ఎంతో అనుబంధముంది. అందుకే టాలీవుడ్ లో సినిమాలు, డైలాగ్స్ అంటే మక్కువ ఎక్కువ చూపిస్తున్నాడు.

గత వారం అల వైకుంఠపురములో చిత్రంలోని సెన్సేషనల్ సాంగ్ బుట్ట బొమ్మకు తన భార్యతో కలిసి స్టెప్పులేసి అలరించిన వార్నర్ ఈసారి సినిమా డైలాగ్ వీడియో చేసి అందరినీ సంతోషపరిచాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ అయిన పోకిరి సినిమాలోని ఐకానిక్ డైలాగ్ “ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను” టిక్ టాక్ వీడియో చేసాడు. దీనికి తెలుగు రాష్ట్రాల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇలా ప్రతీ వారం టాలీవుడ్ కు సంబంధించిన సాంగ్  కానీ డైలాగ్ కానీ టిక్ టాక్ చేస్తానని ఈ క్రికెటర్ మాట ఇచ్చిన విషయం తెల్సిందే. అందుకే అభిమానులందరూ లక్షల్లో ఈ వీడియో చేయండి, లేదు ఇది చేయండి అంటూ సూచనలు ఇస్తున్నారు.

డేవిడ్ వార్నర్ పోకిరి టిక్ టాక్ కు దర్శకుడు పూరి జగన్నాథ్ స్పందించాడు. నీలో సహజంగానే నటుడు ఉన్నాడు. నా సినిమాలో కామియోలో నటింపచేయాలని ఉంది అని పూరి జగన్నాథ్ అన్నాడు. మరి భవిష్యత్తులో అలాంటిదేమైనా జరుగుతుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

Guess the movie?? I tried everyone ??‍♂️??‍♂️Good luck ?? #tollywood #requested #helpme #

A post shared by David Warner (@davidwarner31) on

Credit: Instagram