విజయ్ దేవరకొండ దర్శకుడి తండ్రి మృతి

Dear comrade director bharath kamma's father died విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని రూపొందిస్తున్న యువ దర్శకులు భరత్ కమ్మ తండ్రి రమణారావు ఈరోజు చనిపోయారు . భరత్ కమ్మ తండ్రి రమణారావు (65) గతకొంత కాలంగా కాలేయ సంబందిత వ్యాధితో బాధపడుతున్నాడు . అయితే ఆ వ్యాధి నయం కాకపోవడంతో ఈరోజు మృతి చెందాడు . తండ్రి మరణంతో భరత్ కమ్మ కుటుంబములో తీవ్ర విషాదం నెలకొంది .

దర్శకుడిగా మారిన కొడుకు సక్సెస్ ని చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు రమణారావు దాంతో మరింతగా కుమిలిపోతున్నాడు భరత్ . విజయ్ దేవరకొండ ని డైరెక్ట్ చేస్తున్న భరత్ డియర్ కామ్రేడ్ విజయం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . డియర్ కామ్రేడ్ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే దర్శకుడి తండ్రి మరణంతో కొద్దిరోజులు షూటింగ్ కి అంతరాయం జరుగనుంది .

English Title: Dear comrade director bharath kamma’s father died