విజయ్ దేవరకొండ కు సారీ చెప్పిన దర్శకుడు


Dear comrade director says sorry to Vijay devarakonda
Vijay devarakonda and Bharat Kamma

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కు సారీ చెప్పాడు దర్శకుడు భరత్ కమ్మ . డియర్ కామ్రేడ్ చిత్రానికి భరత్ కమ్మ దర్శకుడు అన్న విషయం తెలిసిందే . తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ బాషలలో ఏకకాలంలో రిలీజ్ కానున్న ఈ చిత్రంలోని రెండో పాటని నిన్న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ దర్శకుడు  భరత్ కమ్మ సమయానికి రెండో పాటని కట్ చేసి ఇవ్వకపోవడంతో అది వాయిదాపడింది , దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆశలన్నీ నీరుగారి పోయాయి .

దాంతో విజయ్ దేవరకొండ తో పాటుగా విజయ్ ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పాడు దర్శకులు భరత్ కమ్మ . అయితే తప్పకుండా 15 వ తేదీన మాత్రం రెండో పాటని విడుదల చేస్తామని హామీ ఇచ్చాడు . 15 వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు డియర్ కామ్రేడ్ లోని రెండో పాట విడుదల కానుంది . ఇక ఈ పాట ఈ ఏడాది బెస్ట్ సాంగ్ అని ఇంతకుముందే ప్రకటించాడు విజయ్ దేవరకొండ . ఇక ఆడియన్స్ విన్నాక అవునా ? కాదా ? అన్నది డిసైడ్ చేయనున్నారు .