రీ షూట్ లో డియర్ కామ్రేడ్


విజయ్ దేవరకొండరష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్ . ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది కానీ కొన్ని తీసిన సన్నివేశాలు సరిగ్గా రాలేదని రష్ చూసుకున్నాక అర్దమయ్యిందట దాంతో రీ షూట్ చేసే పనిలో పడ్డారు ఆ చిత్ర బృందం . భరత్ కమ్మ దర్శకత్వంలో నాలుగు బాషలలో రూపొందుతోంది డియర్ కామ్రేడ్ . తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ బాషలలో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ ల కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన గీత గోవిందం చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో డియర్ కామ్రేడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . అయితే ఈ సినిమాని మే 31 న విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ జూన్ కు వాయిదాపడింది తమిళ స్టార్ హీరో సూర్య సినిమా వల్ల .