డియర్ కామ్రెడ్’ మలయాళం ట్రైలర్ రిలీజ్ చేసిన దుల్ఖర్ సల్మాన్!!


dear comrade malayalam trailer
dear comrade malayalam trailer

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందంవంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల మదిలో సుస్తిర స్థానాన్ని  సంపాదించుకున్న విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యారు. విజయ్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలందరూ క్యూలు కడుతున్నారు

విజయ్ దేవరకొండ హీరోగా నటించినడియర్ కామ్రేడ్చిత్రం ఈ నెల 26న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. గ్లామరస్ హీరోయిన్ రష్మిక మందన్న విజయ్ సరసన రెండోసారి అలరించనుంది. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ని నిన్న హైదరాబాద్ లో రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.

అందరి అంచనాలకు రీచ్ అయ్యే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించారు మైత్రి నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సివియం), బిగ్ బెన్ సినిమాస్ అధినేత యష్ రంగినేని. కాగా ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రం మలయాళం ట్రైలెర్ ని ఈ రోజు మధ్యాన్నం హీరో దుల్ఖర్ సల్మాన్ చేతులమీదుగా విడుదల చేసారు!!