డియర్ కామ్రేడ్ ఫస్ట్ డే షేర్


Dear Comrade Collections
Dear Comrade Collections

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ దాదాపు 8 కోట్ల షేర్ ని రాబట్టింది నిన్నటి రోజున . ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే సుమా ! ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో భారీ ఓపెనింగ్స్ సాధించింది డియర్ కామ్రేడ్ చిత్రం . దాంతో 7 కోట్ల 49 లక్షల షేర్ కామ్రేడ్ వశం అయ్యింది . విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో ఈ భారీ షేర్ సొంతం అయ్యింది .

ఇది తెలుగు రాష్ట్రాలలో మాత్రమే ! ఇక తమిళ , కన్నడ , మలయాళ భాషలలో అలాగే ఓవర్ సీస్ లో కలిపితే ఈ మొత్తం మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది . అయితే అది ఈరోజు మధ్యాహ్నం కు అన్ని బాషల లెక్కలు రానున్నాయి . రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ చిత్రంగా విడుదలైన డియర్ కామ్రేడ్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది . ఈజోరు ఇలాగె మరో రెండు రోజులు కొనసాగితే చాలు బయ్యర్లు అందరూ లాభాల్లోకి వస్తారు .

తెలంగాణ – 3. 02 కోట్లు

సీడెడ్ – 88 లక్షలు

కృష్ణా – 38 లక్షలు

గుంటూరు – 62లక్షల 50 వేలు

నెల్లూరు – 26 లక్షలు

ఈస్ట్ – 90 లక్షలు

వెస్ట్ – 53లక్షల 25 వేలు

ఇతరత్రా – 2. 05

మొత్తం – 7. 49 కోట్లు