భారీ అంచనాల మధ్య డియర్ కామ్రేడ్


dear comrade release date
Dear Ccomrade Poster

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ భారీ అంచనాల మధ్య ఈనెల 26న విడుదల అవుతోంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మీక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

విజయ్ దేవరకొండ కు యువతలో విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో ఏకకాలంలో డియర్ కామ్రేడ్ విడుదల అవుతోంది. అలాగే ఓవర్సీస్ లో కూడా పెద్ద ఎత్తున విడుదల అవుతోంది డియర్ కామ్రేడ్. ఈ చిత్రానికి పోటీ ఏది లేకపోవడంతో సినిమా బాగుంటే సంచలన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.