ఆస్కార్ ఎంట్రీ లిస్ట్ లో స్థానం సంపాదించిన డియర్ కామ్రేడ్


Dear Comrade
ఆస్కార్ ఎంట్రీ లిస్ట్ లో స్థానం సంపాదించిన డియర్ కామ్రేడ్

వచ్చే ఏడాది జరగనున్న చలనచిత్ర అత్యున్నత పురస్కారం ఆస్కార్ కు ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగానికి మన దేశం నుండి ఒక చిత్రం ప్రతి ఏటా పంపబడుతుంది. అందుకుగాను వివిధ భాషల నుండి ఫైనల్ చేసిన 28 భారతీయ చిత్రాలలో విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన డియర్ కామ్రేడ్ కు స్థానం లభించింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ త్వరలో ఈ 28 చిత్రాలలోనుంచి ఒక చిత్రాన్ని ఆస్కార్ బరిలో దింపుతారు.

రేపటికల్లా ఆస్కార్ కు పంపబడే ఆ చిత్రమేంటి అన్నది తెలిసే అవకాశముంది. ప్రముఖ ఫిల్మ్ మేకర్ అపర్ణ సేన్ ఈ ఎంపికకు జ్యూరీగా వ్యవహరిస్తారు. డియర్ కామ్రేడ్ తో పాటు సూపర్ డీలక్స్, వడ చెన్నై, ఊరి, బద్లా, బదాయ్ హో, అంధధూన్, ఆర్టికల్ 15, కేసరి, గల్లీ బాయ్ తదితర చిత్రాలు రేసులో నిలిచాయి. మరి ఏ చిత్రం చివరిగా ఆస్కార్ బరిలో నిలుస్తుందో చూడాలి.