డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో


డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
Dear Comrade pre release event at Vizag

డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున వైజాగ్ లో నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు . ఈనెల 26 న సినిమా విడుదల అవుతుండటంతో 24 న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసాడు హీరో విజయ్ దేవరకొండ . భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే .

విజయ్ దేవరకొండరష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రాన్ని దక్షిణాదిన అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు . ఇప్పటికే మూడు రాష్ట్రాలు తిరిగి రాగా ఇటీవలే తెలంగాణలో మ్యూజికల్ ఫెస్ట్ నిర్వహించారు . ఇక ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు . ఈనెల 26 న విడుదల కానున్న డియర్ కామ్రేడ్ చిత్రంపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి.