రీ షూటింగ్ పూర్తిచేసుకున్న డియర్ కామ్రేడ్


డియర్ కామ్రేడ్
డియర్ కామ్రేడ్

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డియర్ కామ్రేడ్ . కాగా ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది అయితే కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వాటిని మళ్ళీ చిత్రీకరించారు దాంతో రీ షూట్ కూడా పూర్తి చేసుకున్నారు . ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాటిని కంప్లీట్ చేసి జూన్ లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

విజయ్ దేవరకొండరష్మిక మందన్న ల కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన గీత గోవిందం చిత్రం సూపర్ హిట్ కావడంతో డియర్ కామ్రేడ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి . తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ బాషలలో ఈ చిత్రం విడుదల కానుంది . అయితే విడుదల తేదీలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు .