డియర్ కామ్రేడ్ రిలీజ్ డేట్ వచ్చింది


విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” డియర్ కామ్రేడ్ ” . తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది . డియర్ కామ్రేడ్ రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా ……. జూలై 26 న . నెల రోజులుగా రిలీజ్ పరంగా ఇబ్బంది పడుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూలై 26 ని ఫిక్స్ చేసుకుంది .

విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి . టీజర్ తో అంచనాలు పెంచిన విజయ్ దేవరకొండ పుట్టినరోజు రేపు దాంతో డియర్ కామ్రేడ్ రిలీజ్ విషయాన్నీ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు . ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదల కానుంది . రేపు ఈ హీరో పుట్టినరోజు కావడంతో మరో టీజర్ ని రిలీజ్ చేసే పనిలో ఉన్నారట డియర్ కామ్రేడ్ చిత్ర బృందం .