డియర్ కామ్రేడ్ రన్ టైం ఎంతో తెలుసా ?


Dear Comrade
Dear Comrade

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది . ఈ చిత్రానికి యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అయితే అది కాదు మ్యాటర్ ఈ సినిమా రన్ టైం ……… ఇంతకీ డియర్ కామ్రేడ్ రన్ టైం ఎంతో తెలుసా ….. ….. 2 గంటల 49 నిమిషాలు . అంటే దాదాపు మూడు గంటలు అన్నమాట !

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం కూడా ఎక్కువ నిడివి ఉన్న చిత్రమే ! అయితే కథలో ప్రేక్షకులు లీనమైతే రన్ టైం ఎక్కువగా ఉన్నా పెద్దగా పట్టించుకోరు అనేది ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి . ఇది కూడా అలాగే అనిపిస్తే సూపర్ హిట్ కొట్టినట్లే ! లేదంటే బోర్ కొట్టేలా ఉంటే మాత్రం తప్పకుండా అది సినిమాపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది . రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించాడు . తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో ఈనెల 26 న విడుదల కానుంది డియర్ కామ్రేడ్ చిత్రం .