డియర్ కామ్రేడ్ ట్రైలర్ విడుదల


Dear Comrade Trailer
Dear Comrade Trailer Pic

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదల అయ్యింది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మీక మందన్న నటిస్తోంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే….. యాక్షన్ , రొమాన్స్ కలగలిపి ఉంది. రష్మీక మందన్న చాలా అందంగా ఉంది అంతకంటే బాగా క్రికెటర్ గా మెప్పించేలా కనబడుతోంది. క్రికెటర్ గా నటించడమే కాదు లవర్ గా లిప్ లాక్ లు కూడా ఇస్తూ కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది.

ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే…… విజయ్ దేవరకొండ క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది ట్రైలర్ చూస్తుంటే. మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల ముందు అన్నట్లుగా సాగింది కథ. మొత్తానికి ఈ డియర్ కామ్రేడ్ తో సంచలనం సృష్టించేలా కనబడుతున్నాడు విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్ చిత్రం జూలై 26న విడుదల కానుంది.