దీపావళి సందర్భంగా టాలీవుడ్ హంగామా – పోస్టర్లు, పాటలు, ఫస్ట్ లుక్స్, మరెన్నో


దీపావళి పండగ వచ్చేస్తోంది. ఏడాదికి ఓసారి వచ్చే వెలుగుల పండగ కావడంతో ప్రతిఇంటా సరికొత్త వెలుగులతో దీపావళి హంగామా మొదలైపోయింది. ఈ నేపథ్యంలో తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా మేమేమైనా తక్కువ తిన్నామా అంటోంది. సాధారణంగా సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి పండగను మించిన పెద్ద అకేషన్ ఏం ఉండదు. ఈ నేపథ్యంలో దీపావళి పండగ సందర్భంగా టాలీవుడ్ లో కూడా బాగా సందడి కనిపించింది. చాలా సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ దిగిపోయింది. అవేమిటో ఓ లుక్కేద్దామా.

* ముందుగా సరిలేరు నీకెవ్వరు చిత్రం నుండి లేడీ అమితాబ్ విజయశాంతి లుక్ ను రిలీజ్ చేసారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత సినిమా చేస్తోన్న విజయశాంతి ఈ చిత్రంలో ప్రొఫసర్ భారతి పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలో విజయశాంతి పాత్రకు మహేష్ బాబు పాత్రకు ఉన్న కనెక్షన్ ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.

vijayashanthi
Vijayashanthi look From Sarileru Neekevvaru

* తర్వాత కాసేపటికి వెంకీ మామ దిగిపోయాడు. అక్కినేని నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజయింది. మంచి పల్లెటూరు వాతావరణంలో ఉన్న సీన్లను టీజర్ లో చూపించారు. అయితే దీపావళి సందర్భంగా ఇప్పుడు ఒక పోస్టర్ ను వదిలారు. సినిమాలోని మరో కోణాన్ని తెలిపేలా నాగ చైతన్య, వెంకటేష్ ఇద్దరూ చాలా సీరియస్ లుక్ ఇస్తున్నారు. నాగ చైతన్య ఆర్మీ దుస్తుల్లో కనిపిస్తుండడం విశేషం.

Venky Mama Look
Venky Mama Look

* ఇక సంక్రాంతికి వస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తన సినిమా “ఎంత మంచివాడవురా” నుండి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ వదిలాడు.

Entha Manchivadavu Ra Look
Entha Manchivadavu Ra Look

* చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న రెండో చిత్రానికి పేరు ఖరారైంది. సూపర్ మచ్చి అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. పులి వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Super Machi Look
Super Machi Look

* రవిబాబు నుండి వస్తోన్న మరో థ్రిల్లర్ ఆవిరి, ఈసారి దెయ్యం ఆవిరి రూపంలో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మూడు టీజర్ లు రిలీజయ్యాయి. నవంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన దీపావళి విషెస్ పోస్టర్ బయటకు వదిలారు.

Aaviri Movie Look
Aaviri Movie Look

* శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తిప్పరా మీసం సినిమాకు సంబందించిన రాధా రమణం అనే పాటను విడుదల చేసారు. ఈ పాట వినగానే శ్రోతలను అలరిస్తోంది.

* ప్రస్తుతం డిస్కో రాజా చేస్తున్న మాస్ మహారాజా రవితేజ దీపావళి సందర్భంగా తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేసాడు. పోలీస్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని తెరకెక్కించబోతున్నాడు.

#RT66 Look
#RT66 Look

* ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. ప్రచారంలో ఉన్నట్లుగానే ఈ సినిమాకి రూలర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇంకా ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలవుతుందని కూడా ప్రకటించారు.

Ruler Movie Look
Ruler Movie Look

* మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న దర్బార్ చిత్రంలో ఒక పోస్టర్ ను దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వదిలారు. ఈ పోస్టర్ లో రజిని గన్ పట్టుకుని డైనమిక్ గా ఉన్నాడు.

Darbar Movie Look
Darbar Movie Look

* పొద్దున్న విజయశాంతి లుక్ విడుదల చేసిన సరిలేరు నీకెవ్వరు బృందం సాయంత్రం మహేష్ బాబు పోస్టర్ ను రివీల్ చేసారు. బండిపై కాజువల్ గా వస్తున్న మహేష్ లుక్ టెరిఫిక్ గా ఉంది. ఈ రోజు విడుదల చేసిన రెండు పోస్టర్స్ లోనూ చిత్రం జనవరి 12న విడుదలవుతుందని తెలిపారు.

Mahesh Babu Look From Sarileru Neekevvaru
Mahesh Babu Look From Sarileru Neekevvaru

* ఇక అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్రంలోని రెండో పాట రాములో రాముల ను చెప్పినట్లుగానే సాయంత్రం విడుదల చేసారు. ఇన్స్టంట్ హిట్ గా నిలుస్తోన్న ఈ సాంగ్ అప్పుడే యూట్యూబ్ రికార్డులను వేటాడుతోంది.

 

ఇవండీ దీపావళి సందర్భంగా టాలీవుడ్ చేసిన హంగామా.