దీపిక `మ‌హాన‌టి` అందుకే చూస్తోందా?


దీపిక `మ‌హాన‌టి` అందుకే చూస్తోందా?
దీపిక `మ‌హాన‌టి` అందుకే చూస్తోందా?

`బాహుబ‌లి` త‌రువాత ప్ర‌భాస్ స్థాయి, మార్కెట్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. దీంతో అత‌ని నుంచి సినిమా అంటే అంతా ఆ స్థాయిలోనే ఊహిస్తున్నారు, ఆశిస్తున్నారు. `సాహో` త‌రువాత ప్ర‌భాస్ ఓ విభిన్న‌మైన పిరియాడిక్ ల‌వ్‌స్టోరీలో న‌టిస్తున్నారు. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ‌కుమార్ తెర‌కెక్కిస్తున్నారు.

ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్  ఓ భారీ చిత్రాన్ని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి. అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `మ‌హాన‌టి` చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న నాగ్అశ్విన్ ఈ చిత్రాన్ని స‌రికొత్త నేప‌థ్యంలో తెర‌పైకి తీసుకురాబోతున్నారంటూ ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా బాలీవుడ్ భామ అలియాభ‌ట్ న‌టిస్తుంద‌ని, ఇందు కోసం 15 కోట్లు పారితోషికం ఇవ్వ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజాగా ఆ స్థానంలో దీపికా ప‌దుకునే న‌టించ‌నుంద‌ని అర్థ‌మౌతోంది. తాజాగా `మ‌హాన‌టి` చిత్రాన్ని చూసిన‌ట్టు హీరోయిన్ దీపికా ప‌దుకునే ఇన్ స్టా గ్రామ్ వేదికగా వెల్ల‌డించ‌డంతో ప్ర‌భాస్ చిత్రంలో దీపిక న‌టించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.