మరో హాలీవుడ్ రీమేక్ లో దీపిక పదుకోన్


మరో హాలీవుడ్ రీమేక్ లో దీపిక పదుకోన్
మరో హాలీవుడ్ రీమేక్ లో దీపిక పదుకోన్

యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ నిజజీవిత కథ ఆధారంగా ఇటీవల రిలీజ్ అయిన చప్పాక్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు దీపిక పదుకోన్. ఆ సినిమా మంచి విజయం సాధించింది. మరోవైపు తన నిజజీవిత భాగస్వామి రణ్ వీర్ సింగ్ హీరోగా రూపొందుతున్న 83 సినిమాలో జంటగా నటిస్తోంది. ఇక ఇప్పుడు దీపిక తన తరువాతి సినిమాను కూడా ఖరారు చేసింది. 2015 లో హాలీవుడ్ లో వచ్చిన “ద ఇంటర్న్” సినిమా రీమేక్ గా ఇప్పుడు దీపిక ఒక సినిమా చేస్తోందట. మరొక విశేషం ఏంటంటే, ఈ సినిమాను హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన వార్నర్ బ్రదర్స్ తో కలిసి దీపికా నిర్మించటం. ఇప్పటికే ఆమె గత చిత్రం అయిన “చప్పాక్” కు దీపిక ఒకానొక నిర్మాతగా వ్యవహరించారు.

ఇక ఈ సినిమాలో దీపిక తోపాటు మరొక ప్రధానమైన పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటులు రిషికపూర్ నటిస్తున్నారు. ఈ కథను 2018 లో కన్నడంలో “హోట్టీగాగి బేను బట్టేగాగి” అనే పేరుతో రీమేక్ చేసారు. కె.జి.ఎఫ్ లో మనకు కథ చెప్పే ఆనంద్ బసిరాజు పాత్రలో గుర్తుండిపోయిన అనంత్ నాగ్, రాధిక చేతన్ ముఖ్యపాత్రలుగా నటించారు. హాలీవుడ్ లో ఆ క్యారెక్టర్ లో ఆస్కార్ విన్నర్ రాబర్ట్ దీనోరో నటించారు

ఈ సినిమా కథ ప్రకారం ఒక 70 ఏళ్ళ వ్యక్తి తనకన్నా వయసులో చాలా చిన్నదైన లేడీ బాస్ దగ్గర కంపెనీలో ఇంటర్న్ గా జాయిన్ అవుతాడు. తనకున్న అనుభవం తో కొద్ది రోజుల్లోనే తనచుట్టూ ఉన్న సహా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తూ, మంచి పేరు పొందుతాడు. అయితే ఉన్నట్టుండి వచ్చిన ఒక సమస్య నుండి తను,తన కంపెనీ ని, తన యజమానిని ఎలా కాపాడుకున్నాడు.? అసలు ఆ కంపెనీకి ఎందుకు ఆయన ఇంటర్న్ గా వచ్చాడు.? అనేది సినిమా కథ.