మొత్తానికి ఆ హీరోయిన్ హీరోలు ఒక్కటయ్యారు


Deepika Padukone & Ranveer Singh are married

గతకొంత కాలంగా ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న జంట ఎట్టకేలకు సుముహూర్తం చూసుకొని ఒక్కటయ్యారు దీపికా పదుకోన్రణ్ వీర్ సింగ్ లు . నాలుగేళ్లుగా ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని అప్పట్లో రకరకాల వార్తలు వచ్చాయి అయితే ఎప్పటికప్పుడు మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చిన ఈ జంట గత ఏడాది నుండి సీరియస్ గా పెళ్లి గురించి ఆలోచిందించి . మొత్తానికి అనుకున్నట్లుగానే నిన్న డెస్టినేషన్ మ్యారేజ్ కంప్లీట్ చేసుకుంది . అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటే అలసిపోవడం తప్ప పెళ్లి చేసుకున్న కిక్ ఉండదని భావించిన ఈ జంట డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకొని తనివితీరా ఆ మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంది .

మొత్తానికి ఒక ఘట్టం పూర్తయ్యింది . ఆన్ స్క్రీన్ రొమాన్స్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ కూడా పండించి నెటిజన్లకు మంచి కిక్ ఇచ్చారు దీపికా పదుకోన్ – రణ్ వీర్ సింగ్ .పెళ్లి తంతు పూర్తికావడంతో భారీ ఎత్తున రిసెప్షన్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు . బెంగుళూర్ లోను అలాగే ముంబై లోనూ రిసెప్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయట . తమ అభిమాన జంట ఒక్కటి కావడంతో దీపికా – రణ్ వీర్ ల అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు .

English Title: Deepika Padukone & Ranveer Singh are married