ఆ హీరో మోసం చేసాడు కాబట్టే వదిలేసిందట


deepika padukone shocking comments on ranbir kapoor

రణ్ బీర్ కపూర్ తో నిజాయితీ గా రిలేషన్ లో ఉన్నాను అయితే అదే స్థాయిలో తన నిజాయితీ నిరూపించుకోలేదు పైగా రెడ్ హ్యాండెడ్ గా నాకు తప్పు చేస్తూ దొరికిపోయాడు అందుకే అతడితో విడిపోయానని అసలు సంగతి ఇన్నాళ్లకు చెబుతోంది బాలీవుడ్ హాట్ భామ దీపికా పడుకునే . రణ్ బీర్ కపూర్ కు ప్లే బాయ్ ఇమేజ్ ఉంది బాలీవుడ్ లో , ఈ హీరో తో డేటింగ్ చేయడానికి పలువురు భామలు క్యూ కడుతున్నారు దాంతో ఒకరి తర్వాత ఒకరికి గుడ్ బై చెబుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు . సోనమ్ కపూర్ ని , కత్రినా కైఫ్ ని ,దీపికా పడుకునే ని లైన్లో పెట్టిన ఈ హీరో కొద్దిరోజులు వాళ్లతో బాగానే నెట్టుకొచ్చి తర్వాత అడ్డంగా బుక్ కావడంతో వాళ్లతో రిలేషన్ దెబ్బతింది .

2007 వరకు దీపికా పడుకునే తో చెట్టాపట్టాలేసుకు తిరిగాడు రణ్ బీర్ అయితే రణ్ బీర్ కపూర్ ప్రేమలో నిజాయితీ లేదని గమనించిన దీపికా కు ఓ తప్పు చేస్తూ దొరికి పోయాడట అయితే మరోసారి ఇలాంటి తప్పు చేయనని ఒక ఛాన్స్ ఇచ్చి చూడమని బ్రతిమిలాడాడట కానీ దీపికా మాత్రం ఒకసారి మోసపోవచ్చు కానీ మళ్ళీ ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే అతడికి గుడ్ బై చెప్పి వదిలేసిందట . అతడితో బ్రేకప్ అయ్యాక చాలాకాలం డిప్రెషన్ కి లోనయ్యిందట , తర్వాత తర్వాత తేరుకొని మళ్ళీ మామూలు జీవితానికి అలవాటు పడిందట దీపికా పడుకునే .

English Title: deepika padukone shocking comments on ranbir kapoor