ఎన్సీబీ ముందుకు ర‌ణ్‌వీర్‌తో…

ఎన్సీబీ ముందుకు ర‌ణ్‌వీర్‌తో...
ఎన్సీబీ ముందుకు ర‌ణ్‌వీర్‌తో…

డ్ర‌గ్స్ వివాదం ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. సుశాంత్ అనుమానాస్ప‌ద మృతిలో డ్ర‌గ్స్ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. రియాని అదుపులోకి తీసుకోవ‌డంతో బాలీవుడ్‌లో వ‌రుస పేర్లు బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఈ కేసులో స‌మ‌న్లు అందుకున్న టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్ ఎన్సీబీ అధికారుల ముందు శుక్ర‌వారం హాజ‌రైన విష‌యం తెలిసిందే. అదే రోజు దీపిక మేనేజ‌ర్ క‌రిశ్మా ప్ర‌కాష్ కూడా విచార‌ణ‌కు హాజ‌రు కావ‌డంతో ఇక శ‌నివారం దీపిక హాజ‌రు కావ‌డం ఖాయం అని తేలింది.

ఈ కేసులో స‌మ‌న్లు అందుకున్న దీపిక ప‌దుకోన్ శ‌నివారం భ‌ర్త‌, హీరో ర‌ణ్‌వీర్‌సింగ్‌తో క‌లిసి ఎన్సీబీ అధికారుల ముందు హాజ‌రు కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ముందు ఎన్సీబీ అధికారుల నుంచి దీపిక నోటీసులు అందుకున్న త‌రువాత ర‌ణ్‌వీర్‌సింగ్ శిన‌వారం విచార‌ణ‌కు త‌న భార్య‌తో క‌లిసి వ‌స్తాన‌ని, త‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు వున్నాయ‌ని ఎన్సీబీ అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేసిన‌ట్టు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వినిపించాయి.

అయితే ఆ వార్త‌ల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని ఎన్సీబీ అధికారులు స్ప‌ష్టం చేశారు. దీపిక కుటుంబం నుంచి అలాంటి అభ్య‌ర్థ‌న త‌మ దృష్టికి రాలేద‌ని, స‌మ‌న్లు అందిన వెంట‌నే దీపిక టీమ్ నుంచి విచార‌ణ‌కు హ‌జ‌రు అవుతాం అంటూ ఈ మెయిల్ మాత్ర‌మే వ‌చ్చింద‌ని ఎన్సీబీ అధికారులు స్ప‌ష్టం చేశారు. అయితే అందుకు భిన్నంగా దీపిక‌తో క‌లిసి ర‌ణ్‌వీర్ సింగ్ విచార‌ణ సంద‌ర్భంగా క‌నిపించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.