ఏం సోను సూద్.. రాజకీయాల్లోకి వస్తావా? పీఎం అవుతావా?

ఏం సోను సూద్.. రాజకీయాల్లోకి వస్తావా? పీఎం అవుతావా?
ఏం సోను సూద్.. రాజకీయాల్లోకి వస్తావా? పీఎం అవుతావా?

ఈ కోవిడ్ కారణంగా జరిగిన అతి కొన్ని మంచి సంగతులతో ఒకటి, సోను సూద్ ఎంతటి గొప్ప మనిషి అన్నది తెలియడం. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనే కాక సెకండ్ వేవ్ సమయంలోనూ సోను సూద్ సేవలు కొనసాగిస్తున్నాడు. కష్టం అంటే ముందుకు వచ్చి సహాయం చేస్తున్నాడు సోను సూద్.

ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా సోను సూద్, కోవిద్ కారణంగా బాధపడుతున్న వారికి తగు సహాయాలు అందిస్తున్నాడు. మందులు అందించడం, ఆక్సిజన్ సమకూర్చడం, హాస్పిటల్ బెడ్స్ అందుబాటులో ఉండేలా చూడటం, ఇలా సమస్య ఏదైనా కానీ సోను సూద్ రియల్ హీరోయిజం అందరినీ ముగ్దుల్ని చేస్తోంది.

దీంతో అందరిలో హీరో అయిన సోను సూద్ రాజకీయాల్లోకి రావాలని, ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు జనం. రోజురోజుకూ ఈ డిమాండ్స్ పెరిగిపోతున్నాయి. విలేఖరులు సోను సూద్ నే ఈ విషయం అడిగేసారు. “నేను చేస్తోన్న సహాయాల వలన ప్రజలు అలా కోరుకోవడంలో తప్పు లేదు. అయితే నాకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు. కామన్ మ్యాన్ గానే నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను” అని సోను సూద్ ఫుల్ క్లారిటీతో చెప్పేసాడు.