దేవా క‌ట్టాతో స్టార్ హీరో వెబ్ సిరీస్‌!


Deva katta new web series for GMB entertainment
Deva katta new web series for GMB entertainment

డిజిట‌ల్ ప్ర‌పంచం ప్ర‌స్తుతం సినిమాని శాసిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప‌లు నిర్మాణ సంస్థ‌లు సినిమాలు త‌గ్గించుకుని వెబ్ సిరీస్‌ల నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు కూడా వున్నాయి. బాలీవుడ్‌లో ఇప్ప‌టికే ఆల్ట్ బాలాజీ, మ్యాక్స్ ప్లేయ‌ర్‌, జీ5, ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ వంటి సంస్థ‌లు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. తెలుగులో ఇటీవ‌ల గీతా ఆర్ట్స్ కూడా వెబ్ ప్ర‌పంచంలోకి అడుగు పెట్టింది. వ‌రుస‌గా వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది.

ఈ జాబితాలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ సంస్థ  జిఎమ్‌బి కూడా ఎంట‌ర‌వుతోంది. ఇప్ప‌టికే మ‌ల్టీప్లెక్స్ రంగంలోకి ఎంట‌రైన మ‌హేష్ బాబు త్వ‌ర‌లో డిజిట‌ల్ రంలోకి ఎంట‌ర‌వుతున్నారు. ఘ‌ట్ట‌మ‌నేని మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ని స్థాపించి సినిమా నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌హేష్ త్వ‌ర‌లో దేవా క‌ట్టా తో ఓ వెబ్ సిరీస్‌ని నిర్మించ‌బోతున్నారు. దీనికి అమెజాన్ ప్రైమ్ కూడా అసోసియేట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతోంది.

త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతున్న ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. మ‌హేష్ బాబు యంగ్ హీరో అడివి శేష్ న‌టిస్తున్న `మేజ‌ర్‌` చిత్రానికి భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఓ రియ‌ల్ హీరో జీవిత క‌థ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.