దేవా క‌ట్టా `ఇంద్ర‌ప్ర‌స్థం` థీమ్ అదిరిందిగా!దేవా క‌ట్టా `ఇంద్ర‌ప్ర‌స్థం` థీమ్ అదిరిందిగా!
దేవా క‌ట్టా `ఇంద్ర‌ప్ర‌స్థం` థీమ్ అదిరిందిగా!

నారా చంద్ర‌బాబు నాయుడు, వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిల స్నేహ బంధం, రాజ‌కీయ జీవితం.. ఆ త‌రువాత నేత‌లుగా ఎదిగే క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన లైవ‌ర్లీ నేప‌థ్యంలో ఓ కాన్సెప్ట్‌ని విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి కి చెప్పాన‌ని, దాన్ని ఆయ‌న త‌న‌దిగా చెప్పుకుంటున్నార‌ని ద‌ర్శ‌కుడు దేవా కట్టా ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. దానికి బ‌దులిచ్చిన విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి ఆ ఐడియా త‌న‌దేన‌ని, త‌న‌కు దేవా క‌ట్టా చెప్ప‌లేద‌ని వెల్ల‌డించారు.

ఇదిలా వుంటే నారా చంద్ర‌బాబు నాయుడు, వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిల స్నేహ బంధం, రాజ‌కీయ జీవితం.. ఆ త‌రువాత నేత‌లుగా ఎదిగే క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన లైవ‌ర్లీ నేప‌థ్యంలో ఓ వెబ్ సిరీస్‌ని తెర‌పైకి తీసుకురాబోతున్నామంటూ విష్ణు వ‌ర్థ‌న్ ఇందూరి ప్ర‌క‌టించారు. దీనికి స్ట్రాంగ్ కౌంర్ ఇస్తూ దేవా క‌ట్టా ఏకంగా అదే కాన్సెప్ట్‌తో `ఇంద్ర‌ప్ర‌స్థం` పేరుతో ఓ సినిమా‌ని ప్రారంభిస్తున్న‌ట్టు.. దీనికి సంబంధించిన థీమ్ పోస్ట‌ర్‌ని శుక్ర‌వారం రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

`ప్ర‌పంచంలో జ‌రిగే పోలీల‌న్నింటికీ ప‌ర్ప‌స్ ఒక‌టే.. విన్న‌ర్స్‌ని ఎంచుకోవ‌డం.. విన్న‌ర్స్ ర‌న్ ద వ‌ర‌ల్డ్‌..ఆ పోటీలో అనుకోకుండా ఇద్ద‌రు స్నేహితులు ఎదురైతే.. ఆ ఆట‌కున్న కిక్కే వేరు..` అంటూ దేవా క‌ట్టా రిలీజ్ చేసిన థీమ్ పోస్ట‌ర్ అదిరిపోయింది. ఇద్ద‌రి వైపు నిజం లేదు. నిజం వుంది ఒక్క సైడ్ మాత్ర‌మే అంటూ దేవా క‌ట్టా థీమ్ పోస్ట‌ర్‌తో ఇస‌క్తిని రేకెత్తిస్తున్నారు. ప్రోడోస్ న్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షా. వి, తేజ . సి ఈ మూవీ‌ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో దేవా క‌ట్టా ఓ చిత్రాన్ని ఇటీవ‌ల ప్రారంభించిన విష‌యం తెలిసిందే. దాని త‌రువాత ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తార‌ట‌.