మరోసారి అదే ఫార్ములాతో వస్తున్న దేవా కట్టా!


మరోసారి అదే ఫార్ములాతో వస్తున్న దేవా కట్టా!
మరోసారి అదే ఫార్ములాతో వస్తున్న దేవా కట్టా!

టాలీవుడ్ దర్శకుడు దేవా కట్టాకు సెన్సిబుల్ డైరెక్టర్ అన్న పేరు ఉంది. ఈ దర్శకుడు సినిమాల విషయంలో బలమైన ఇంపాక్ట్ చూపిస్తాడు. వెన్నెల చిత్రంతో డెబ్యూ చేసిన దేవా కట్టా ప్రస్థానం చిత్రంతో నేషనల్ అవార్డును సైతం గెలుచుకున్నాడు. ఈ చిత్రం మరెన్నో అవార్డులు, రివార్డులను గెలుచుకుంది. అయితే ప్రస్థానం తర్వాత పలు చిత్రాలు చేసిన దేవా కట్టా సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయాడు. ఆటోనగర్ సూర్య, డైనమైట్ వంటి చిత్రాలు నిరుత్సాహపరిచాయి.

ఇక దేవా కట్టా ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. మనం గమనిస్తే దేవా కట్టా సినిమాల్లో ఎక్కువగా కనిపించే పాయింట్ పాలిటిక్స్. సాయి ధరమ్ తేజ్ తో తీసే చిత్రంలో కూడా పాలిటిక్స్, రౌడీయిజంను టచ్ చేస్తూనే కథ అల్లుకున్నాడు.

మరి ఇప్పటిదాకా సక్సెస్ ఇవ్వని ఈ ఫార్ములాతో దేవాకట్టా ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.