పది కోట్లు ముంచిన నాగార్జున -నాని


devadas closing collections

దేవదాస్ గా నటించిన నాగార్జున , నాని లు పది కోట్లకు ముంచారు బయ్యర్లని . నాగార్జున – నాని బయ్యర్ల ని ముంచడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 27 న విడుదలైన దేవదాస్ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది , అయితే నాగార్జున – నాని నటించిన మల్టీస్టారర్ చిత్రం కావడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి దాంతో హిట్ అవుతుందని అనుకున్నారు కట్ చేస్తే మూడు రోజుల తర్వాత కలెక్షన్లు మొత్తం డ్రాప్ అవ్వడం మొదలు పెట్టింది . నాగార్జున – నాని ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది .

వరల్డ్ వైడ్ 36 కోట్ల బిజినెస్ కాగా ఇప్పటివరకు ఈ చిత్రం 26 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది అంటే పది కోట్ల నష్టం బయ్యర్లకు వచ్చిందన్న మాట . ఈ సినిమాని నిర్మించిన అశ్వనిదత్ కు లాభమే కానీ దేవదాస్ ని కొన్న బయ్యర్లు మాత్రం పది కోట్ల మేర నష్టపోయారు . నాగార్జున గతకొంత కాలంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటూ కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు . అలాగే నాని కూడా ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు . వరుస విజయాలకు బ్రేక్ పడింది .

ఏరియాల వారీగా దేవదాస్ సాధించిన షేర్ ఇలా ఉంది
తెలంగాణ – 7. 12 కోట్లు
సీడెడ్ – 2. 83 కోట్లు
ఈస్ట్ – 1. 37 కోట్లు
వెస్ట్ – 1.09 కోట్లు
గుంటూరు – 1. 71 కోట్లు
కృష్ణా – 1.60 కోట్లు
నెల్లూర్ – 0. 78 కోట్లు
ఉత్తరాంధ్ర – 2 . 70 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 2 . 80 కోట్లు
ఓవర్ సీస్ – 3. 72 కోట్లు
మొతం – 25. 72 కోట్లు