దేవదాస్ 35 కోట్లు రాబట్టగలరా


Devadas misfire on box-office

అక్కినేని నాగార్జున , నాని కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ ఈనెల 27న విడుదలైన విషయం తెలిసిందే. మొదటిరోజున దేవదాస్ ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ ని 7 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. నాగార్జున కెరీర్ పరంగా చూసిన నాని కెరీర్ పరంగా చూసిన బెస్ట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరూ సోలోగా నటించిన చిత్రాలకు 6 లేదా 7 కోట్ల గ్రాస్ కి మించి రాలేదు అయితే ఇద్దరూ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం కావడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి . అయితే ఈ సినిమాని కొనుక్కున్న బయ్యర్లు లాభాలను పొందాలంటే 35 కోట్ల షేర్ రాబట్టాలి . మరి అంత సొమ్ము రాబట్టే దమ్ము ఈ దేవదాస్ కు ఉందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది.

మొదటి రోజున వచ్చింది కేవలం 7 కోట్ల షేర్ మాత్రమే అంటే ఇంకా 28 కోట్ల షేర్ రావాలి. సినిమాకు పాజిటివ్ టాక్ అంతగా లేదు కాబట్టి ఈరోజు , రేవు వచ్చే కలెక్షన్స్ మాత్రమే భారీ స్థాయిలో వస్తాయి . సోమవారం నుండి కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం ఖాయం . దానికి తోడు అక్టోబర్ 5న విజయ్ దేవరకొండ నటించిన నోటా విడుదల అవుతోంది కాబట్టి దేవదాస్ కు కష్టకాలం వచ్చినట్లే ! అంటే విజయ్ దేవరకొండ సినిమా వచ్చాక దేవదాస్ ని పట్టించుకునే వాళ్ళు అంతగా ఉండరు . దాంతో 28 కోట్ల షేర్ రాబట్టడం దేవదాస్ కు కష్టమే . నోటా వచ్చేలోపు మరో 10 లేదా 15 కోట్లు రాబడితే గొప్పే ! అని అంటున్నారు అంటే ఏ రకంగా చూసిన దేవదాస్ బయ్యర్లకు నష్టం తప్పేలా లేదు. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన చిత్రం అయినప్పటికీ బయ్యర్లకు మాత్రం న్యాయం జరగడం కష్టమే అని తెలుస్తోంది. నాగార్జున డాన్ గా నటించగా నాని డాక్టర్ గా నటించాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ దేవదాస్ లో కథ , కథనం ఆకట్టుకోవడం లేదు కాకపోతే నాగార్జున , నాని ల బ్రోమాన్స్ మాత్రం ఆకట్టుకుంటోంది .

English Title: Devadas misfire on box-office