దేవదాస్ రివ్యూ


devadas movie review
దేవదాస్ రివ్యూ

దేవదాస్ రివ్యూ :
నటీనటులు : నాగార్జున , నాని , రష్మిక , ఆకాంక్ష సింగ్
సంగీతం : మణిశర్మ
నిర్మాత : అశ్వనీదత్
దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
రేటింగ్ : 2. 5 / 5
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2018

అక్కినేని నాగార్జున , నాని ల కాంబినేషన్ లో అగ్ర నిర్మాత అశ్వనీదత్ వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించిన మల్టీస్టారర్ చిత్రం ” దేవదాస్ ”. యువ దర్శకులు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది . మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ దేవదాస్ అజరామరమైన దేవదాస్ చిత్ర టైటిల్ కు న్యాయం చేసేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .
కథ :
దాస్ (నాని ) ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ , అతడికి సరదాగా , ప్రేమగా ఉండటం అంటే ఇష్టం , దేవా (నాగార్జున ) ఓ అండర్ వరల్డ్ డాన్ , అయితే ఒకసారి జరిగిన సంఘటనలో దేవా గాయాలపాలై దాస్ పనిచేస్తున్న ఆసుపత్రిలో చికిత్స పొందుతాడు . ఆ సమయంలో దేవ – దాస్ మంచి స్నేహితులౌతారు . అయితే దేవా మాఫియా డాన్ అని తెలియడంతో దాస్ కు దేవకు మధ్య విబేధాలు వస్తాయి . కట్ చేస్తే మాఫియా డాన్ అయిన దేవా కు దాస్ దూరం అయినప్పటికీ దాస్ కు దేవాలా మారిపోయే పరిస్థితి వస్తుంది . దేవా మంచి మనిషిలా మారాడా ? దాస్ ఎవరిని హత్య చేయాలనుకున్నాడు ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

నాగార్జున
నాని
రష్మిక మందన్న
నాగ్ – నాని ల మధ్య వచ్చే సన్నివేశాలు
వైజయంతి మూవీస్ నిర్మాణ విలువలు
ఛాయాగ్రహణం
డ్రా బ్యాక్స్ :
కథ
కథనం
డైరెక్షన్

నటీనటుల ప్రతిభ :

డాన్ గా నటించిన నాగార్జున తనదైన చలాకీతనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . డాన్ అయినప్పటికీ అండర్ వరల్డ్ మాఫియాని టచ్ చేయకుండా వినోద ప్రధానమైన డాన్ గా ప్రేక్షకులను మెప్పించాడు నాగార్జున . ముఖ్యంగా నాగార్జున – నాని ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి . ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది . నాని మరోసారి తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు . రష్మిక మందన్న , ఆకాంక్ష సింగ్ లకు పెద్దగా ప్రాధాన్యమున్న పాత్రలు లభించలేదు కానీ ఉన్నంతలో బాగానే మెప్పించారు . మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధిమేరకు నటించారు .

సాంకేతిక వర్గం :

కథగా చెప్పడానికి ఏమిలేదు , అయితే స్క్రీన్ ప్లే పరంగా అక్కడక్కడా మెరుపులు మెరిపించాడు శ్రీరామ్ ఆదిత్య . కొన్ని డైలాగ్స్ బాగున్నాయి . కానీ డైరెక్షన్ పరంగా పూర్తిస్థాయిలో రాణించలేకపోయాడు శ్రీరామ్ ఆదిత్య . కొన్ని అనవసర సన్నివేశాలతో నెట్టుకొచ్చాడు కానీ ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పుడు మరింత బెటర్ ట్రీట్ మెంట్ చేయాల్సి ఉండే . దర్శకుడిగా విఫలమయ్యాడు శ్రీరామ్ ఆదిత్య . వైజయంతి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి . మణిశర్మ అందించిన పాటలు , నేపథ్య సంగీతం కూడా అలరించేలా ఉంది . ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది .

ఓవరాల్ గా :

ఓసారి చూడొచ్చు . అంచనాలు లేకుండా వెళితే బెటర్ …….

English Title: devadas movie review

                                      Click here for English Review