బిగ్ బాస్ 4: మెహబూబ్ కాదు, దేవి నాగవల్లి ఎలిమినేషన్!


బిగ్ బాస్ 4: మెహబూబ్ కాదు, దేవి నాగవల్లి ఎలిమినేషన్!
బిగ్ బాస్ 4: మెహబూబ్ కాదు, దేవి నాగవల్లి ఎలిమినేషన్!

బిగ్ బాస్ సీజన్ 4 లో ఇప్పటివరకూ రెండు ఎలిమినేషన్స్ జరిగిన విషయం తెల్సిందే. మొదటి వారం సూర్య కిరణ్, రెండో వారం కరాటే కళ్యాణి హౌస్ నుండి వెళ్లిపోయారు. ఇక మూడో వారం ఎలిమినేషన్ అత్యంత ఆసక్తికరంగా ఉండనుంది. మూడో వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉండగా నిన్నటి ఎపిసోడ్ లో ఇద్దర్ని నాగార్జున సేవ్ చేసాడు. మోనాల్ గజ్జర్, లాస్యలను నాగార్జున సేవ్ చేయగా ఇంకా నామినేషన్స్ లో మెహబూబ్, కుమార్ సాయి, అరియనా, దేవి నాగవల్లి, హారికలు ఇంకా నామినేషన్స్ లో ఉన్నారు.

అయితే మొదటి రెండు వారాలు ఎలిమినేషన్ ఎవరు అయ్యేది ఒక క్లారిటీ ఉండేది. సూర్య కిరణ్, కరాటే కళ్యాణిలు ఎలిమినేట్ అవుతారని ముందే ఊహించారు. ఇక మూడో వారం ఆ క్లారిటీ లేదు. ముందు నుండీ దేవి నాగవల్లి, అరియానా ఎలిమినేట్ అవుతారనేమో అనుకున్నారు. కానీ హుమన్స్ వెర్సస్ రోబోట్స్ టాస్క్ లో మెహబూబ్ పెర్ఫార్మన్స్ కు నెగటివిటీ పెరిగిపోవడంతో తను ఎలిమినేట్ అవుతారని భావించారు.

తాజా సమాచారం ప్రకారం మెహబూబ్ కాదని దేవి నాగవల్లి ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. ఇద్దరికీ మధ్య ఓట్లు తేడా 1 శాతం డిఫరెన్స్ ఉంది. మరి బిగ్ బాస్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.