ఎన్టీఆర్ 30కి మ్యూజిక్ డైరెక్ట‌ర్ అత‌నే?

ఎన్టీఆర్ 30కి మ్యూజిక్ డైరెక్ట‌ర్ అత‌నే?
ఎన్టీఆర్ 30కి మ్యూజిక్ డైరెక్ట‌ర్ అత‌నే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత త‌న 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో  చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు కూడా. యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో సుధాక‌ర్ మిక్కిలినేని ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. `జ‌న‌తా గ్యారేజ్‌` త‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిసి చేస్తున్న సినిమా కావ‌డం, పాన్ ఇండియా స్థాయి మూవీ ఇద‌ని కొర‌టాల హింట్ ఇవ్వ‌డంతో ఈ చిత్రంపై స‌హ‌జంగానే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ప్ర‌స్తుతం టాక్ హాఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచిన ఈ చిత్రానికి దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నారు. గ‌తంలో దేవి `జ‌న‌తా గ్యారేజ్‌`కి సంగీతం అందించారు. ఈ మూవీ పాట‌ల ప‌రంగా, నేప‌థ్య సంగీతం ప‌రంగా హ్యూజ్ హిట్ అనిపించుకుంది. దేవికి కూడా మంచి పేరొచ్చింది. దీంతో మ‌రోసారి దేవిశ్రీ‌ప్ర‌సాద్‌ని ద‌ర్‌శ‌కుడు కొర‌టాల రిపీట్ చేస్తున్నార‌ని తెలిసింది.

జూన్ ద్వితీయార్ధంలో ప్రారంభం కానున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుద‌ల కానుంది. `జ‌న‌తా గ్యారేజ్‌తో కొరటాల, ఎన్టీఆర్‌, దేవిల త్ర‌యం మ్యాజిక్ చేశారు. అదే మ్యాజిక్‌ని ఈ మూవీతో రిపీట్ చేయ‌బోతున్నార‌ని, పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.