పుష్ప మ్యూజిక్ గురించి ఓపెనప్ అయిన దేవి శ్రీ ప్రసాద్

పుష్ప మ్యూజిక్ గురించి ఓపెనప్ అయిన దేవి శ్రీ ప్రసాద్
పుష్ప మ్యూజిక్ గురించి ఓపెనప్ అయిన దేవి శ్రీ ప్రసాద్

తన మ్యూజిక్ తో సినిమాకు అండగా నిలబడటం దేవి శ్రీ ప్రసాద్ స్పెషాలిటీ. ఈ మధ్య కొంచెం డల్ అయిన దేవి మళ్ళీ ఉప్పెన చిత్రానికి ఇచ్చిన సంగీతంతో తానేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. అలాగే దేవి ఇప్పుడు పుష్ప చిత్రానికి సంగీతం అందిస్తోన్న విషయం తెల్సిందే.

సుకుమార్ సినిమా అనగానే దేవి శ్రీ ప్రసాద్ మరో లెవెల్లో పని చేస్తాడు. “సుకుమార్ చిత్రాలకు పని చేసేటప్పుడు ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది” అని చెబుతున్నాడు దేవి. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో కొత్త ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నట్లు వెల్లడించాడు.

ఇక పుష్ప సంగీతం గురించి మాట్లాడుతూ, “ఈ చిత్రంలో కొత్త సౌండ్స్ వింటారు. సరికొత్తగా ప్రయత్నిస్తున్నాను. చంద్రబోస్ సాహిత్యాన్ని అందిస్తున్నారు” అని వెల్లడించాడు. సంగీతం కాకుండా తనకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమని వెల్లడించాడు. అది తన తండ్రి వద్ద నుండి వచ్చిందని తెలిపాడు.