మణిశర్మ పరువు తీస్తున్న దేవీ, తమన్


మణిశర్మ పరువు తీస్తున్న దేవీ, తమన్
మణిశర్మ పరువు తీస్తున్న దేవీ, తమన్

అస్సలు నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి.? తీసుకున్న తాళం ఏంటి.? ఆ పాట ఏ నంబర్.? నువ్వు పాడే టెంపో ఏ నంబర్.? చేసిన పాటలకు పొగడ్తలకు బదులు, పైన చెప్పినదానికన్నా ఇంకా దారుణంగా చివరకు నాలాంటి పసి పిల్లల చేత బూతులు తిట్టించుకోవడం అలవాటు అయిపోయింది, తెలుగు సినిమా సంగీతంలో జంట కవులు గా పేరు తెచ్చుకున్న దేవీ , తమన్. అన్నా….. అన్నా. అని వెంటపడుతుంటే కనీసం నా అ…అ… అదే,అస్సలు పట్టించుకోవడంలేదు అంటున్నా.

అసలు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లెం ఏంటంటే, మా అన్నలు ఇద్దరికీ మంది ఎక్కువ అయ్యేసరికి, మజ్జిగ పలచబడింది. ఇంతకు ముందు తమ సినిమాల పాటలు తామే బుద్ధిగా అటూ,ఇటూ తిప్పి వాయించుకునే వాళ్ళు. ఇప్పుడు మరీ దారుణంగా ఎవడిదో సినిమా ట్యూన్ లు వాడేస్తున్నారు. అదీ ఎదో చిన్న చితకా సినిమాలకు కాదు. పెద్ద హీరోల సినిమాలకు కూడా ఇలా చేస్తుంటే ఆ హీరో మా ఫాన్స్ మా అన్నలను బూతులు తిడుతున్నారు. మరి, మీ ఫాన్స్ అయిన మేము ఏం చెయ్యాలి చెప్పండి.

ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు లో ఫస్ట్ పాటను దగ్గరుండి మరీ అస్సాం పంపించిన మా దేవీ అన్న కంటే మించిపోయాడు తమన్. వెంకీ మామ సినిమాలో రిలీజ్ అయిన కోకోకోలా పెప్సీ – మామ అల్లుడు సెక్సీ పాటను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆల్ టైం ఫేవరేట్ సాంగ్ “మేరె అంగనే మే , తూ మారా క్యా కాం హై” నుండీ మొత్తం ఎత్తి పడేసాడు. అంతకుముందు కూడా అంతే, మా మాస్ మహారాజ్ రవితేజ సినిమాలలో ఇలా అమితాబ్ పాటలు వాడేసాడు, సరే, రవి అన్న అమితాబ్ ఫ్యాన్స్ కదా! O.K అనుకుంటే, ఇది ఏం సామీ.?

సురేష్ బాబు అంకుల్ ఏం అనలేదా.? బాబీ అన్నకు నోట్లో నాలిక లేదనే విషయం మాకు సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడే క్లారిటీ వచ్చేసింది. మొత్తం మీద మణిశర్మ గారి శిష్యులుగా ఎంట్రీ ఇచ్చి, మీరు చేస్తోంది ఇదా.? సినిమాలు తక్కువైనా దేవీ అన్న, సినిమాలు ఎక్కువైన తమన్ అన్న ఇలా ఇద్దరూ కాపీ క్యాట్ ట్యూన్స్ కొడుతుంటే పక్క ఇండస్ట్రీ వాళ్ళు మనల్ని చూసి నోటితో కాకుండా…. సరే వద్దులే బాగోదు. మణిశర్మ గారూ… దయచేసి ఒక మంచు కురిసే రాత్రి మా వాళ్ళని పిలిపించుకుని పర్సనల్ గా మాట్లాడండి సార్.