ర‌ణ్‌వీర్ `గ‌ల్లీబాయ్‌`..ధ‌నుష్‌.?


ర‌ణ్‌వీర్ `గ‌ల్లీబాయ్‌`..ధ‌నుష్‌.?
ర‌ణ్‌వీర్ `గ‌ల్లీబాయ్‌`..ధ‌నుష్‌.?

ప్రేక్ష‌కుల‌కు కొత్త త‌ర‌హా చిత్రాల్ని అందించాల‌ని ప్ర‌య‌త్నించే హీరోల్లో త‌మిళి హీరో ధ‌నుష్ శౌలి విభిన్నం. `అసుర‌న్‌` చిత్రంతో త‌మిళంలో సంచ‌ల‌నం సృష్టించిన ధ‌నుష్ తాజాగా న‌టించిన చిత్రం `ప‌ట్టాస్‌`. ఇదే చిత్రాన్ని `లోక‌ల్ బాయ్‌` పేరుతో సీహెచ్ స‌తీష్‌కుమార్‌ తెలుగులో అందిస్తున్నారు. మెహ‌రీన్‌, స్నేహ క‌థానాయిక‌లుగా న‌టించారు. త‌మిళంలో స‌క్సెస్ సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంటుంద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు.

థ‌నుష్ న‌టించిన `అసుర‌న్‌` అనూహ్య విజ‌యాన్ని సాధించ‌డంతో తాజా చిత్రంపై తెలుగులో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆర్‌.ఎస్‌. దొరై సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ధ‌నుష్ వ‌య‌సు మ‌ళ్లీన వ్య‌క్తిగా, యువ‌కుడిగా రెండు భిన్న‌మైన పాత్ర‌ల్లో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేశారు. చాలా రోజుల త‌రువాత స్నేహ ధ‌నుష్‌కు జోడీగా హీరోయిన్‌గా న‌టించిన చిత్ర‌మిది.

తెలుగు హీరో న‌వీన్‌చంద్ర విల‌న్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం కోసం ధ‌నుష్ ప్ర‌త్యేకంగా మార్ష‌ల్ ఆర్ట్స్‌లో శిక్ష‌ణ తీసుకున్నార‌ట‌. ఆయ‌న‌పై చిత్రీక‌రించిన పోరాట ఘ‌ట్టాలు సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని చిత్ర నిర్మాత స‌తీష్‌కుమార్ వెల్ల‌డించారు.