సినిమా బ్లాక్ బస్టర్.. దర్శకుడు మాత్రం నాట్ హ్యాపీ


సినిమా బ్లాక్ బస్టర్.. దర్శకుడు మాత్రం నాట్ హ్యాపీ
సినిమా బ్లాక్ బస్టర్.. దర్శకుడు మాత్రం నాట్ హ్యాపీ

తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ సినిమా అసురన్.. దసరా కానుకగా కోలీవుడ్ లో రిలీజై సూపర్ హిట్ అయింది. దాదాపు 100 కోట్లు పైన గ్రాస్ వసూళ్లు సాధించి ధనుష్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. క్రిటిక్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ప్రేక్షకులు సైతం ఇందులోని కంటెంట్ కి ఫిదా అవుతున్నారు. ఇంత జరిగినా కానీ అసురన్ చిత్ర దర్శకుడు వెట్రి మారన్ హ్యాపీగా లేడు.

దీనికి కారణం కూడా చెప్పుకున్నాడు వెట్రి మారన్. ఈ సినిమాకి ఇంకా 22 రోజులు షూటింగ్ ఉన్నా కానీ విడుదలకు 40 రోజులు డెడ్ లైన్ నిర్మాత ప్రకటించాడు. దాంతో రాసుకున్న కథలో కొంచెం భాగం పక్కనపెట్టేయాల్సి వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు హడావిడిగా పూర్తి చేయాల్సి వచ్చిందని, అనుకున్న ప్రకారం సినిమా రాలేదని బాధ వ్యక్తం చేసాడు వెట్రి మారన్.

అయితే అదృష్టం కొద్దీ చిత్రం అందరికీ నచ్చిందని, వసూళ్లు కూడా బాగున్నాయని అన్నాడు వెట్రి మారన్. ధనుష్, ఆ దర్శకుడు కాంబినేషన్ లో ఇప్పటికే పొల్లావదాన్, ఆడుగళం, వడ చెన్నై వంటి క్రిటికల్ హిట్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు అసురన్ కూడా ధనుష్ కెరీర్ లో బిగ్గెస్ హిట్ గా నిలిచింది.