ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో


dhanush teamup with rx 100 director

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించిన దర్శకుడు అజయ్ భూపతి కాగా ఆ దర్శకుడి కి తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడట . తమిళనాట ధనుష్ స్టార్ హీరో అన్న విషయం తెలిసిందే . రజనీకాంత్ పెద్దల్లుడు అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు . హీరోగానే కాదు నిర్మాతగా , దర్శకుడిగా కూడా సత్తా చాటాడు ధనుష్ . తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి మార్కెట్ ని ఏర్పరచుకున్నాడు ధనుష్ .

ఇక అజయ్ భూపతి విషయానికి వస్తే రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన ఈ దర్శకుడు ఆర్ ఎక్స్ 100 చిత్ర కథ పట్టుకొని పలువురు హీరోల దగ్గరకు వెళ్లి విసిగిపోయి కొత్త హీరోతో చేసాడు కట్ చేస్తే బ్లాక్ బస్టర్ అయ్యింది . కేవలం 2 కోట్లతో సినిమా చేయగా 11 కోట్ల షేర్ సాధించి ప్రభంజనం సృష్టించింది ఆర్ ఎక్స్ 100 చిత్రం . ఇక శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , రీమేక్ , డబ్బింగ్ రైట్స్ రూపంలో మరింత సొమ్ము రానుంది దాంతో ఈ దర్శకుడికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . ఇప్పటికే తెలుగులో పలువురు హీరోలు అజయ్ తో సినిమాలు చేయడానికి సిద్ధం అవుతుండగా ధనుష్ కూడా సినిమా చేద్దామని చెప్పాడట . అదీ సక్సెస్ కున్న మహిమ .

English Title: dhanush teamup with rx 100 director