నా పేరు రాసి ఉన్న “తూటా” రిలీజ్ కి రెడీ


Dhanush Thoota Movie Releasing on Dec 27th
Dhanush Thoota Movie Releasing on Dec 27th

సినిమాలు ఎక్కడినుండో రావు, మన చుట్టూ ఉన్న మనుషుల జీవితాలు వాటిలో జరిగిన సంఘటనల ఆధారంగానే వస్తాయి.అదేవిధంగా కొంత మంది దర్శకుల సినిమాలు చూసినట్లయితే, ఒక పూర్తి జీవితాన్ని ఏ మాత్రం కృత్రిమత్వం లేకుండా తెరపై చూసిన అనుభూతి కలుగుతుంది. వారిలో ఒకానొక దర్శకుడు గౌతం వాసుదేవ్ మీనన్. ఆయన సినిమాలలో క్యారెక్టర్స్  ప్రవర్తించే విధానం, నిజ జీవిత మనుషులకు దగ్గరగా ఉంటుంది. హీరో, హీరోయిన్, విలన్ ఇలా మూడు ప్రధానమైన పాత్రలను తన ప్రతి సినిమాలో వైవిధ్యభరితంగా చూపిస్తాడు గౌతం మీనన్.

ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన “ఎనై నోకి పాయుం తూటా” (నా పేరు రాసి ఉన్న బులెట్ ) సినిమాను తెలుగు లో “తూటా” పేరుతో ఈనెల 27 న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తమిళ్ తోపాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న విలక్షణ నటుడు ధనుష్ మరియు మేఘా ఆకాష్ ఇందులో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. నటుడు బాబీ సింహా ఇందులో మరొక ముఖ్యపాత్ర చేస్తున్నాడు. ఇక తమిళంలో ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితంలో కొంతమంది వల్ల ఎదురైనా సమస్యల నేపధ్యంలో ఈ సినిమా జరుగుతుంది అని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో

ప్రేమలో పడి
మనసులే చెడి
తప్పదు ఈ దారి
మృగంలా మారి

అంటూ ఈ కథలో ఉన్న అనేక వేరియేషన్స్ ని చూపించిన పద్ధతి, మ్యూజిక్ డైరెక్టర్ శివ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ ఆర్ .ఆర్ అల్టిమేట్ గా ఉన్నాయి. ఇక ప్రేక్షకులలో ధనుష్ కి మరియు డైరెక్టర్ గౌతం మీనన్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా మళ్ళీ మనల్ని ఎప్పటిలాగే గౌతం మీనన్ సినిమాల మాదిరి మ్యాజిక్ చేసి గట్టిగా డిస్టర్బ్ చెయ్యాలని కోరుకుందాం.