నాగ్ కోసం బాలీవుడ్ భామ‌ని దించేస్తున్నారుగా?Diamirza to romance Akkineni Nagarjuna
Diamirza to romance Akkineni Nagarjuna

`మ‌న్మ‌థుడు-2` ఆశించిన విజ‌యాన్ని అందించ‌క‌పోవ‌డంతో కొంత విరామం తీసుకున్న‌ట్టుగా క‌నిపించిన నాగార్జున సైలెంట్‌గా తెర‌పైకి తీసుకొచ్చిన చిత్రం `వైల్డ్ డాగ్‌`.  నాగార్జున న‌టిస్తున్న తాజా యాక్ష‌న్ చిత్రం `వైల్డ్ డాగ్‌`. మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగార్జున ఎన్ ఐ ఏ ఆఫీస‌ర్ విజ‌య్‌ వ‌ర్మ‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని 2009లో జ‌రిగిన హైద‌రాబాద్‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో రూపొందిస్తున్నారు.

రా కంటెంట్‌తో అత్యంత స‌హ‌జ‌త్వంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ద్వారా అహిషోర్ సొలోమ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నాగ్ త‌న గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా కొత్త త‌ర‌హా పాత్ర‌లో స్టైలిష్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి గ‌త కొన్ని రోజులుగా హీరోయిన్ స‌మ‌స్య త‌లెత్తింది. చాలా మంది క‌థానాయిక‌ల్ని ప‌రిశీలించిన ద‌ర్శ‌కుడు పూజా హెగ్డేని కూడా సంప్ర‌దించాల‌నుకున్నార‌ట‌. కానీ ఇప్ప‌టికే ఆమె వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా వుండ‌టంతో బాలీవుడ్ నాయిక‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జాను నాగ్ కు జోడీగా ఖ‌రారు చేసిన‌ట్టు తాజా స‌మాచారం. సంజ‌య్‌ద‌త్ బ‌యోపిక్ ఆధారంగా రాజ్ కుమార్ హిరాణీ రూపొందించిన `సంజు` త‌రువాత దియా మ‌రో చిత్రంలో న‌టించ‌లేదు. తాజా ఆఫ‌ర్ నిజ‌మైతే దియా న‌టిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.