అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా కాంపౌండ్ నుండి విడిపోయారా?


Allu Arjun Fans
అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా కాంపౌండ్ నుండి విడిపోయారా?

మెగా కాంపౌండ్ లో ఇప్పుడు ఒక క్రికెట్ టీమ్ కు సరిపడినంత మంది హీరోలు ఉన్నారు. సౌత్ ఇండియాలో అతిపెద్ద ఫ్యాన్స్ బేస్ లలో ప్రముఖమైనది మెగా ఫ్యాన్స్ గ్రూప్. అయితే ఇందులోంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ బయటకి వచ్చేసారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రీసెంట్ గా జరిగిన వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా ఫ్యాన్స్ అందరితోనూ ఆడిటోరియం కళకళలాడింది. అయితే ఆ ఫ్యాన్స్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేరని తెలుస్తోంది.

అందరూ అనుకునే కావాలని ఈ ఈవెంట్ కు డుమ్మా కొట్టినట్లు సమాచారం. నిజానికి చెప్పను బ్రదర్ ఇష్యూ అప్పుడే మెగా ఫ్యాన్స్ మధ్య పొరపచ్చాలు వచ్చాయి. మధ్యలో అల్లు అర్జున్ పవన్ కలిసి మీడియా ముందుకు వచ్చినా ఆ దూరం అలానే ఉండిపోయింది. పైకి అంతా బాగానే ఉన్నా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకో మెగా ఫ్యాన్స్ తో కలవలేకపోతున్నారన్నది ప్రముఖంగా వినిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లో జరగనున్న సైరా ప్రీ రిలీజ్ వేడుక సమయానికి ఈ విషయం మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.