మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడం ఖాయం


Did Ramcharan doing special role in koratala siva and chiranjeevi's film
Chiranjeevi, Ramcharan and Koratala Siva

మెగాస్టార్ చిరంజీవి – రాంచరణ్ ల కాంబినేషన్ ఓ కొరటాల శివ సినిమా చేయబోతున్నాడన్న వార్త ఫిలిం నగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది . ఈ వార్త నిజమే అయితే మెగా ఫ్యాన్స్ కిక్ ఇవ్వడం ఖాయం . మెగా ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా అన్నమాట . చిరంజీవి తో పాటు చరణ్ ని కూడా కలిపి వెండితెర మీద చూడటం అంటే మాటలా ? చరణ్ రేంజ్ కూడా చాలా బాగా పెరిగింది ఇంతకుముందు చిత్రాలతో పోల్చితే .

కొరటాల శివ చిరంజీవి తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమాలో మరో పవర్ ఫుల్ రోల్ ఉందట ! ఆ పాత్రలో చరణ్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాడట దర్శకుడు కొరటాల శివ . ఒకవేళ చరణ్ అంగీకరిస్తే తప్పకుండా మెగా ఫ్యాన్స్ కు ఫీస్ట్ అనే చెప్పాలి . ఇప్పటివరకు కొరటాల శివ చేసిన సినిమాలన్నీ ఘన విజయాలు అందుకున్నవే ! దాంతో ఈ మెగా ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం .

English Title: Did Ramcharan doing special role in koratala siva and chiranjeevi’s film