ప్రియాంక చోప్రా – నిక్ ల మధ్య గొడవలు


ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్ ల మధ్య గొడవలు జరుగుతున్నాయట ,ఈ విషయాన్నీ స్వయంగా ప్రియాంక చోప్రా వెల్లడించడం విశేషం . 36 ఏళ్ల ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది గత ఏడాది . అయితే ఏడాది పూర్తి కాకుండానే ఇద్దరి మధ్య విబేధాలు వస్తున్నాయట దాంతో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయట కాకపోతే అవి విడిపోయేంత పెద్దవి కాకపోవడంతో పాటుగా నన్ను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి కాబట్టి నాకు కష్టం రాకుండా చూసుకుంటున్నాడు అంటూ భర్త గొప్పతనం గురించి చెబుతోంది ప్రియాంక చోప్రా .

ఇక నిక్ జోనాస్ తనకంటే పదేళ్లు చిన్నవాడు అంటూ రకరకాల కథనాలు రాస్తున్నారు అంటూ మండిపడుతోంది ఈ భామ . దానికి ఉదాహరణ కూడా ఇస్తోంది . సాధారణంగా ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువ వయసు ఉంటారని అప్పుడు జరగని చర్చ ఇప్పుడే ఎందుకు జరుగుతోంది అంటూ ఆవేశంతో ఊగిపోతోంది ప్రియాంక చోప్రా . నిజమేగా మరి .