విడాకుల బారిన పడిన మరో హీరో


విడాకులు ఈరోజుల్లో చాలా కామన్ అయిపొయింది . ఇక బాలీవుడ్ లో ఇప్పటికే బోలెడు జంటలు విడాకులు తీసుకోగా తాజాగా ఆ లిస్ట్ లో మరో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ చేరాడు . హీరోగా ఇమ్రాన్ ఖాన్ పలు చిత్రాల్లో నటించాడు కానీ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు దాంతో ఇమ్రాన్ ఖాన్ కాపురంలో చిచ్చు రేగింది . భర్త హీరోగా సక్సెస్ కాకపోవడం , కెరీర్ డోలాయమానంలో పడిపోవడంతో అవంతిక – ఇమ్రాన్ ఖాన్ ల మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు వచ్చాయి .

ఇద్దరి మధ్య గొడవలు తగ్గించడానికి అమీర్ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయిందట . ఎవరికి నచ్చజెప్పాలని చూసినా ఎవరూ తగ్గకపోవడంతో విడాకులు దాదాపుగా ఖాయమైపోయిందని అంటున్నారు . ఇమ్రాన్ ఖాన్ – అవంతిక లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . 8 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు కూడా కానీ ఇన్నేళ్ల కాపురంలో సక్సెస్ అనేది లేకపోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర అగాధం నెలకొంది .