జగపతి బాబు -మహేష్ సినిమా లొల్లి ఏంది ?


mahesh babu and jagapathi babu
mahesh babu and jagapathi babu

సీనియర్ నటుడు జగపతి బాబు ని మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్రకు ఎంచుకున్నారు . షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్ళాడు కూడా కానీ ఎక్కడో తేడా కొట్టింది మహేష్ సినిమాకు గుడ్ బై చెప్పేసాడు . అయితే ఈ విషయం పై మీడియాలో రకరకాల కథనాలు రావడంతో దర్శకులు అనిల్ రావిపూడి అలాగే జగపతిబాబు ఇద్దరు కూడా స్పందించారు .

అయితే ఇద్దరు చెప్పేదాంట్లో కూడా స్పష్టత కొరవడింది . అనిల్ రావిపూడి ఏమో సార్ మీతో తప్పకుండా పనిచేయాలనే కోరుకుంటున్నాను అంటూ చెబుతుంటే జగపతిబాబు ఏమో ! నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది , దాని కోసం రెండు సినిమాలను కూడా వదులుకున్నాను , ఇప్పుడు కావాలన్నా నేను చేయడానికి సిద్దమే అని అంటున్నాడు . అంటే ఈ ఇద్దరి మాటలు వింటుంటే అసలు ఏదో జరిగింది దాన్ని కవర్ చేయడానికి ఇలా చెబుతున్నారు అని అనిపించక మానదు . అయితే కాశ్మీర్ లో మాత్రం ఏదో జరిగింది .