నాగార్జున ని వ్యతిరేకిస్తున్న నాగచైతన్య


differnces between ngarjuna and nagachaitanya

తండ్రి నాగార్జున నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు తనయుడు అక్కినేని నాగచైతన్య . నాగార్జున నిర్ణయాన్ని నాగచైతన్య వ్యతిరేకించడం ఏంటి అని అనుకుంటున్నారా ? ప్రస్తుతం తెలుగులో కానీ బాలీవుడ్ లో కానీ బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది . బాలీవుడ్ లో పలు బయోపిక్ లు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే , ఇక తెలుగులో మహానటి సావిత్రి బయోపిక్ ప్రభంజనం సృష్టించడంతో పాటు అక్కినేని సమకాలీకుడు ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతుండటంతో మహానటుడు అక్కినేని నాగేశ్వర్ రావు బయోపిక్ కూడా తెరకెక్కితే బాగుంటుందని పలువురు భావించారు అయితే నాగార్జున మాత్రం అక్కినేని బయోపిక్ అవసరం లేదని ఎందుకంటే నాన్నగారిది సంపూర్ణ జీవితం , ఆయన జీవితంలో విషాదకరమైన సంఘటనలు ఏవి లేవని అందుకే అవసరం లేదని అన్నాడు .

కానీ నాగచైతన్య మాత్రం తాతగారి బయోపిక్ అవసరం పైగా నాకు ఆయన బయోపిక్ చూడాలని ఉందని వ్యాఖ్యానించాడు . నాగచైతన్య మహానటి చిత్రంలో అక్కినేని నాగేశ్వర్ రావు పాత్రలో కొద్దిసేపు కనిపించాడు , అలా నటించడం కష్టమే అయినప్పటికీ చాలా గమ్మత్తుగా ఉందని అయితే పూర్తిస్థాయి బయోపిక్ లో తాతయ్య పాత్ర పోషించడం కష్టమని అంటున్నాడు .

తాతగారి బయోపిక్ చూడాలని చైతూ ఆరాటపడుతున్నాడు , కానీ నాగార్జున మాత్రం అక్కినేని బయోపిక్ వద్దంటున్నాడు . ఇలా భిన్నాభిప్రాయాలతో ఉన్నారు తండ్రీకొడుకులు .

English Title: differences between nagarjuna and naga chaitanya