సాయి పల్లవి కి శర్వానంద్ కు గొడవయ్యిందా


differnces between sharwanand and sai pallavi సాయి పల్లవిశర్వానంద్ జంటగా ” పడిపడి లేచె మనసు ” చిత్రంలో నటిస్తున్నారు . హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం కాగా సాయి పల్లవి కి శర్వానంద్ కి పొసగకపోవడంతో ఇద్దరికీ గొడవ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి . షూటింగ్ సమయంలో సాయి పల్లవి బాగానే ఉన్నప్పటికీ షాట్ అయిపోవడమే ఆలస్యం తనకేమి పట్టనట్లు ఓ బుక్ తీసుకొని దూరంగా వెళ్లి ఒంటరిగా కూర్చుంటూ ఎవరు పిలిచినా రాకుండా , షాట్ కు షాట్ కు ఇబ్బంది పడేలా చేసిందట దాంతో శర్వానంద్ కి కోపం వచ్చి ముఖం మీదే అడిగాడట కానీ ఆమె మాత్రం ఎక్కడా తగ్గకుండా అలానే సమాధానం ఇస్తోందట !

సాయి పల్లవి బిహేవియర్ తో ఇంతకుముందు నాగశౌర్య , నాని లు ఇబ్బంది పడ్డారు . నాగశౌర్య – సాయి పల్లవి జంటగా ”కణం ” అనే చిత్రంలో నటించారు కాగా ఆ సినిమా షూటింగ్ లోనే నాగశౌర్య ని సాయి పల్లవి ఇబ్బంది పెట్టిందని , దాంతో నాగశౌర్య అవమానంగా ఫీలయ్యాడని కథనాలు వచ్చాయి అలాగే నాగశౌర్య కూడా సాయి పల్లవి గురించి ఓపెన్ గానే మాట్లాడాడు తనకు ఇగో ఎక్కువని . ఇక నాని తో ” ఎం సి ఏ ” చిత్రంలో నటించింది . ఆ సినిమా షూటింగ్ లో కూడా నాని తో సాయి పల్లవి గొడవ పడిందని కథనాలు వచ్చాయి కట్ చేస్తే ఇప్పుడు శర్వానంద్ తో గొడవ అయ్యిందట ! మొత్తం మీద ముగ్గురు హీరోలతో గొడవ పది వార్తల్లో నిలిచింది సాయి పల్లవి .

English Title: differnces between sharwanand and sai pallavi