సురక్షితమైన విప్లవాత్మక సంచలనం యు కేర్


digital preventive health care platform

ఏడాది పొడవునా ఫ్రీ ఫిట్ బిట్ & ఈసీజీ పరీక్షలు ఉచితంగా జరిపేందుకు నెలకు రూ.1099 చొప్పున చెల్లించి సబ్ స్క్రైబర్ సర్వీసులు పొందొచ్చు.

న్యూఢిల్లీ, జనవరి 30, 2019: భారతదేశంలోనే అగ్రశేణి ప్రివెంటివ్ హెల్త్ కేర్ సర్వీసుల ప్రొవైడర్ ‘యూకేర్’ వినియోగదారులకు సురక్షితమైన డిజిటల్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ముంబై ప్రధాన కార్యాలయంగా సేవలందిస్తున్న ‘యూ-కేర్’.. ఫిట్ బిట్ (ఈసీజీ మిషన్) యాప్ అందుబాటులో ఉంది. 24 గంటల పాటు అంబులెన్స్, రాయితీతో కూడిన డయాగ్నసిస్ సేవలందిస్తోంది. సబ్ స్క్రైబర్లకు భద్రత కల్పిస్తూ వయో వృద్ధులకు రైడ్ బుక్ చేస్తుంది. ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణె నగరాల్లో సేవలందిస్తోంది.

కేంద్రీకృతమైన సేవలందిస్తున్న ‘యూ-కేర్’వచ్చే ఏప్రిల్ నెలాఖరు నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులకు విస్తరించాలని లక్ష్యంగా ముందుకు వెళుతోంది. యూ-కేర్ కస్టమర్లు ఏడాదికి రూ.1099, రెండేళ్లకు రూ.899 చెల్లించి సబ్‌స్క్రిప్షన్ పొందితే చాలు. యూ-కేర్ బీమా పథకంలో సభ్యుడిగా చేరిన వారం రోజుల్లోనే ఫ్రీ ఫిట్ బిట్, ఈసీజీ మెషిన్ ఒక వెల్‌కమ్ కిట్‌గా అందజేస్తోంది. బీమా వసతి కల్పిస్తూ ఆరోగ్య పరీక్షలకు ఆయా నగరాల్లోని ప్రధాన ల్యాబోరేటరీల్లో తనిఖీ చేసేందుకు రాయితీలు కల్పిస్తోంది.

యూ-కేర్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ గుగ్నానీ మాట్లాడుతూ.. ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా విడిపోయిన తర్వాత ఉరుకులు, పరుగుల జీవితంతో ప్రివెంటివ్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం 25 శాతం మంది భారతీయులు 70 సంవత్సరాలు దాటిన తర్వాత జీవనశైలి సంబంధ వ్యాధులతో.. గుండె జబ్బులతో మరణిస్తున్నారు. ఒక విజన్‌తో ప్రివెంటివ్ హెల్త్ కేర్ సేవలను అందుబాటులోకి తెస్తున్నాం. ఒత్తిళ్లకు దూరంగా ప్రజలంతా జీవనం సాగించాలన్నదే యూ-కేర్ లక్ష్యం’ అని చెప్పారు.