అప్పుడు విలన్ అయ్యాడు…ఇప్పుడు దగ్గరుండి నడిపిస్తున్నాడు

Dil Raaju Gaaru worried about Darbaar movie
Dil Raaju Gaaru worried about Darbaar movie

తెలుగు సినిమాలో పెద్ద నిర్మాత మరియు మంచి పేరు, ప్రఖ్యాతలు  గల నిర్మాత ఎవరు అంటే వెంటనే ‘దిల్ రాజు‘ గారు అంటాము. కారణం ఏదైనా కానీ దిల్ రాజు గారికి సినిమాలు తన కుటుంబం లో భాగస్వామ్యం అయ్యాయి. నిర్మాతగా, పంపిణీదారుడిగా ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ  ఒక మంచి స్థాయి గల  పేరు సంపాదించుకున్నారు దిల్ రాజు గారు.

ఇదే సంవత్సరం రజనీకాంత్ గారి ‘పేట’ సినిమాకి తెలుగులో థియేటర్స్ దొరకటం కష్టం అయ్యింది. సంక్రాంతి రేసులో అప్పటికే ఎఫ్2, వినయ విధేయ రామ, ఎన్.టి.ఆర్. కథా నాయకుడు సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో ఎఫ్2  సినిమా మాత్రమే విజయం సాధించింది. రజనీకాంత్ గారి పేట సినిమా విడుదల అయ్యింది. సినిమా టాక్ బాగానే వచ్చింది కానీ థియేటర్లు లేక అల్లాడిపోయింది సినిమా. సినిమాకి పంపిణీదారుడు అయిన వల్లభనేని అశోక్ దిల్ రాజు మీద పండిపడ్డారు.

అప్పటికే దిల్ రాజు గారు ఎఫ్2 సినిమాకి నిర్మాత కాబట్టి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా  ఒక మాట అన్నారు. తెలుగు సినిమాలే కష్టంగా ఒకొక్కటి సంక్రాంతి రేసులో మంచి రోజు చూసుకొని దిగితుంటే సడెన్ గా తమిళ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు దొరకటం కష్టం అని మాట్లాడేసరికి అశోక్ గారికి దిల్ రాజు గారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త రజినీకాంత్ గారి దాకా వెళ్ళింది. అలా రజినీకాంత్ గారి సినిమాకి తెలియకుండానే విలన్ అయిపోయాడు దిల్ రాజు గారు.

ఈ సారి ఎలాగైనా తన తప్పు తెలుసుకోవాలి అని చెప్పి ‘దర్బార్’ సినిమాకి యూ.వి క్రెయేషన్స్ వారితో కలిసి పంపిణీదారుడిగా మారాడు దిల్ రాజు గారు. 2020 సంక్రాంతికి  ఒకే రోజున అనగా జనవరి 12 వ తేదీన అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ “అలా వైకుంఠపురములో” మరియు మహేష్ బాబు-అనిల్ రావిపూడి ”సరిలేరు నీకెవ్వరూ” సినిమాలు పోటాపోటీగా విడుదల అవుతున్నాయి. అలా ఉండటం చూసిన దిల్ రాజు గారు దర్బార్ సినిమాని జనవరి 10 వ తేదీన విడుదల చెయ్యాలి అని డిసైడ్ అయ్యారు అంటా.

జనవరి 12 తర్వాత అనగా  14 మరియు 15 వ తేదీలలో విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య నటించిన  ‘వెంకీ మామ’, కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎంతమంచి వాడవురా’ సినిమాలు క్యూ లో ఉన్నాయి. అందుకే దిల్ రాజు దర్బార్ సినిమాకి ఈ సారి ఎలా అయినా విలన్ కావొద్దు అనుకుంటూ ఇప్పటినుండి సమస్యకి తగిన పరిష్కారం జనవరి 10 వ తేదీ అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే మహేష్ బాబు గారి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాకి దిల్ రాజు గారు కూడా నిర్మాతల్లో ఒకరు. ఇదంతా చూస్తుంటే అందరూ దిల్ రాజు గారి ముందు జాగ్రత్త ఇద్దరు సూపర్ స్టార్ల కోసం అని అనుకుంటున్నారు.