ప్లాప్ అని వాళ్ళే ఒప్పుకున్నారు


dil raju and nithin agrees srinivasa kalyanam is flop శ్రీనివాస కళ్యాణం చిత్రం అనుకున్న స్థాయిలో ఆడటం లేదని మీడియా ముందు వాపోయారు ఆ చిత్ర బృందం , విచిత్రం ఏంటంటే సక్సెస్ మీట్ అని సమావేశం ఏర్పాటు చేసి ప్లాప్ అని వాళ్లే ఒప్పుకున్నారు . నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో దిల్ రాజు తో పాటుగా హీరో నితిన్ దర్శకుడు సతీష్ వేగేశ్న కూడా నిరుత్సాహంతో మాట్లాడారు . మార్నింగ్ షో కి టాక్ బాగానే ఉంది కానీ మ్యాట్నీ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని , రివ్యూ రాసేవాళ్లకు మా సినిమా నచ్చలేదు అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొంతమంది కి కూడా నచ్చలేదు దాంతో శ్రీనివాస కళ్యాణం పై నెగెటివ్ గా ప్రచారం చేసారని వాపోతున్నాడు దిల్ రాజు .

ఇక నితిన్ అయితే మరీ దారుణంగా మాట్లాడుతున్నాడు , సినిమా బాగుందని అంటున్నారని అయితే దానికి తగ్గ గుర్తింపు మాత్రం రావడం లేదని అది ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని సంవత్సరానికి వస్తుందా ? లేక అయిదేళ్ల కు వస్తుందా ? అన్నది మాత్రం తెలీడం లేదని నిరాశావాదంతో మాట్లాడాడు . మొత్తానికి హిట్ సినిమా అని చెప్పుకోవడానికి బదులుగా ప్లాప్ సినిమా మా శ్రీనివాస కళ్యాణం అని వీళ్ళే స్వయంగా ఒపుకున్నట్లైంది .

English Title: dil raju and nithin agrees srinivasa kalyanam is flop